Cholesterol: ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య వల్ల ఎంతోమంది బాధ పడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం అధిక కొలెస్ట్రాల్ సమస్యకు కారణమవుతోంది. ప్రతిరోజూ ఐదు పండ్లను తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ మితంగా పండ్లను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉంటాయి.
అధిక కొలెస్ట్రాల్ తో బాధ పడేవాళ్లు అవోకాడోను తీసుకుంటే మంచిది. కొంతమంది ఆవోకోడా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తారు. అయితే ఆవోకాడో ఆరోగ్యకరమైన కొవ్వులను ఉత్పత్తి చేయడంతో పాటు అందులో కొలెస్ట్రాల్ ఉండదు. ఎలాంటి సందేహాలు లేకుండా ఆవోకాడో తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శీతాకాలంలో చిరుతిండి తినాలని అనుకునే వాళ్లకు ద్రాక్ష బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!
ద్రాక్ష కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. రుచిగా ఉండటంతో పాటు ద్రాక్ష తినడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. సిట్రస్ జాతికి చెందిన పండ్ల ద్వారా కూడా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సిట్రస్ పండ్ల ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. శీతాకాలంలో లభించే సిట్రస్ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించడంలో తోడ్పడతాయి.
పోషకాలు ఎక్కువగా ఉండేవాటిలో ఆపిల్స్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఆపిల్స్ లో ఉండే పెక్టిన్, ఫైబర్ వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యానికి ఆపిల్స్ వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. రుచికరమైన పండ్లలో స్ట్రాబెర్రీలు కూడా ఒకటి కాగా ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి చర్మానికి మెరుపు రావడానికి కారణమవుతాయి.
Also Read: అకీరాకి కరోనా పాజిటివ్.. పవన్ సాయం నిరాకరించిన రేణూ దేశాయ్ ! కారణమిదే