White Hair: మారుతున్న పరిస్థితుల్లో మనుషుల్లో కూడా మార్పులు వస్తున్నాయి పూర్వం రోజుల్లో ముసలి వారు అయ్యేవరకు కూడా వెంట్రుకలు తెల్లబడేవి కావు. కానీ ప్రస్తుతం కాలానుగుణంగా వస్తున్న పరిణామాలతో ఇరవై ఏళ్లకు తెల్ల వెంట్రుకలు వస్తుండటంత నలుగురిలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. తెల్ల వెంట్రుకలతో ముసలి ముఖంలా కనిపిస్తుండటం బాధాకరమే. దీంతో వారు సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఏవో మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇక ఏం చేయాలనే దానిపైనే నిత్యం వేదనకు గురవుతున్నారు.

తెల్ల జుట్టుతో నలుగురిలో కలవలేక కలవరపాటుకు గురవుతున్నారు. ఏదో ఒకరికి కాదు ఇప్పుడు అందరి జుట్లు తెల్లగా మారుతున్నాయి. ఇరవైలోనే అరవైలా కనిపిస్తున్నారు. తెల్ల జుట్టుతో తల ఎత్తుకోలేకపోతున్నారు. నల్లగా నిగనిగలాడే జుట్టు ఉండాలని అందరు కోరుకుంటున్నా సాధ్యం కావడం లేదు. ఫలితంగా తెల్ల జుట్టును పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నా లాభం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో తెల్ల జుట్టుతో ఏదైనా విందులు, వినోదాల్లో పాల్గొనాలంటే ఏదో వెలితిగా అనిపిస్తోందని వాపోతున్నారు.
తెల్ల జుట్టును నల్లగా చేసే మందులు చాలా వరకు వాడినా ఫలితం మాత్రం శూన్యమే. ఈ క్రమంలో తెల్ల జుట్టును నల్లగా మార్చే ఓ మందును ప్రయత్నించండి. ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఆవనూనె, ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ఇండిగో పొడి వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టాలి. తరువాత మరుగుతున్న నీటిలో గ్లాస్ ను ఉంచి ఐదు నిమిషాలు వేడి చేయాలి. తరువాత ఆరబెట్టి అందులోని ఆయిల్ ను పల్చటి వస్త్రంతో వేరు చేసి సీసాలో భద్రపరచుకోవాలి.
వారానికి రెండుసార్లు పడుకునే ముందు జుట్టుకు రాసుకుని మర్దన చేసుకుంటే త్వరలోనే తెల్లటి జుట్టు నల్లగా మారుతుంది. ఈ చిట్కాను పాటించి తమ తెల్ల జుట్టును నల్లగా మార్చుకుని తమ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశాలు కల్పించుకోవాలి. లేదంటే తెల్ల జుట్టుతోనే కలకాలం ఉండే దౌర్బగ్యాన్ని దూరం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇంకేముంది ఈ సలహా అనుసరించి మందు తయారు చేసుకుని తమ తెల్ల జుట్టును దూరం చేసుకుని నల్ల జుట్టుతో సంతోషంగా గడిపేందుకు మార్గం నిర్దేశించుకోండి.