Constipation: మలబద్ధకమా.. అయితే ఈ 3 పండ్లు తింటే జన్మలో రాదు

మలబద్దకం సమస్య ఉంటే నారింజను తినాలి. ఫుల్ ఫైబర్ ఉండే ఈ ఫ్రూట్ మేలు చేస్తుంది. జీర్ణక్రియను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని వల్ల పేగుల్లో ఉన్న మురికి పోతుంది. దీనిలో నరింగెనిన్ అనేది ఉంటుంది.

Written By: Swathi, Updated On : March 12, 2024 1:18 pm

Constipation

Follow us on

Constipation: బొప్పాయి: బొప్పాయి వల్ల పొట్టకు మంచి మేలు జరుగుతుంది. మలబద్దకం ఉంటే బొప్పాయి తినాలి. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపుకు సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

నారింజ: మలబద్దకం సమస్య ఉంటే నారింజను తినాలి. ఫుల్ ఫైబర్ ఉండే ఈ ఫ్రూట్ మేలు చేస్తుంది. జీర్ణక్రియను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని వల్ల పేగుల్లో ఉన్న మురికి పోతుంది. దీనిలో నరింగెనిన్ అనేది ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

యాపిల్: యాపిల్ లో ఫుల్ ఫైబర్ ఉంటుంది. పేగు కదలికలను పెంచడంలో మంచి పాత్ర పోషిస్తాయి యాపిల్స్. ఇందులో పెక్టిన్ ఉండడం వల్ల..ప్రేగు కదలికలు మెరుగుపడి.. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అయితే యాపిల్స్ ను తొక్కతోనే తినాలి.