https://oktelugu.com/

South Sudan: ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్.. 100 మంది మృతి?

South Sudan:  ప్రపంచ దేశాల ప్రజలను వైరస్ లు గజగజా వణికిస్తున్నాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వైరస్ ల వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు ప్రజలను చాలా టెన్షన్ పెడుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మన దేశంలో కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆఫ్రికాలో మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. దక్షిణ సూడాన్ లో మిస్టరీ వ్యాధి వల్ల ఏకంగా 100 మంది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2021 / 08:50 AM IST
    Follow us on

    South Sudan:  ప్రపంచ దేశాల ప్రజలను వైరస్ లు గజగజా వణికిస్తున్నాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వైరస్ ల వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు ప్రజలను చాలా టెన్షన్ పెడుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మన దేశంలో కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆఫ్రికాలో మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది.

    South Sudan

    దక్షిణ సూడాన్ లో మిస్టరీ వ్యాధి వల్ల ఏకంగా 100 మంది మృతి చెందారు. సూడాన్ రాష్ట్రంలో కొన్నిరోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. అక్కడ తాగే నీళ్లు కలుషితం కాగా ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. సూడాన్ లోని జోంగ్లీలోని ఫంగ‌క్ అనే నగరంలో ఏకంగా 100 కంటే ఎక్కువమంది మృతి చెందారు. సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడి వైద్యాధికారులు ప్రస్తుతం మృతికి గల కారణన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు.

    Also Read: టీమిండియాలో ఆధిపత్యపోరుకు ముగింపు పలికేదెవరు?

    భయంకరమైన వైరస్ వల్ల అక్కడి ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఎంఎస్ఎఫ్ స్థానిక పరిస్థితుల గురించి ఆందోళన చెందుతోంది. దక్షిణ సూడాన్ లో వరదల వల్ల ఎనిమిది లక్షలకు పైగా ప్రజలు ప్రభావితం కాగా 35,000 మంది నిరాశ్రయులయ్యారు. గడిచిన 60 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

    వరదలు ప్రారంభమైనప్పటి నుంచి పోషకాహార లోపంలో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కొత్తకొత్త మిస్టరీ వ్యాధులు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

    Also Read: వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఆ అధికారం అడ్మిన్ లకు మాత్రమే?