7 months pregnant: సడెన్ గా మీ ఫ్రెండ్, లేదా రిలేషన్ లు ప్రెగ్నెంట్ అని చెబితే నమ్మరు. అరె నిన్న మొన్న చూశాను. పొట్ట కూడా కనిపించలేదు. అలా ఎలా? ఇప్పుడు నువ్వు 7 నెలలు అని చెబుతున్నావు? ఏంటి అని ప్రశ్నిస్తారు కదా. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురై ఉంటుంది కదా. బేబీ బంప్ ఉండదు. చిన్నగా ఉంటుంది పొట్ట. శరీరంలో కూడా పెద్దగా మార్పు ఉండదు. మరి ఇది సాధ్యమేనా? అవును, సాధ్యమే. మీకు ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ఇది పూర్తిగా అసాధ్యం కాదు. కొంతమంది స్త్రీలలో, గర్భధారణ సమయంలో బేబీ బంప్ చాలా తేలికగా కనిపిస్తుంది. లేదా కొన్నిసార్లు అది అస్సలు కనిపించదు. ఇంతకీ కొందరికి ఇలా ఉండటానికి కారణం ఏంటి? మంచిదా? చెడా? ఎందుకు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి స్త్రీకి ఈ సమయం ఒకేలా ఉండదు. చాలా తేడాలు ఉంటాయి. కొందరికి సులభంగా ఉంటే కొందరి ప్రెగ్నెంట్ జర్నీ చాలా గందరగోళంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. అయితే కొందరికి మూడు నెలలకే బేబీ బంప్ కనిపిస్తే మరికొందరికి మాత్రం 7నెలలు అయినా సరే బేబీ బంప్ కనిపించదు. ఈ వ్యత్యాసం శారీరక నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదు, అనేక వైద్య కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
కొంతమంది స్త్రీల బేబీ బంప్ ఎందుకు కనిపించదు?
శరీర రకం: పొడవుగా లేదా బలమైన ఉదర కండరాలు ఉన్న స్త్రీలలో పిండం లోపలికి అభివృద్ధి చెందుతున్నప్పుడు పొట్ట చిన్నగా కనిపిస్తుంది.
మొదటి లేదా రెండవ గర్భం: మొదటి గర్భధారణలో, ఉదర కండరాలు బిగుతుగా ఉంటాయి. దీని కారణంగా బేబీ బంప్ తక్కువగా కనిపిస్తుంది. రెండవ లేదా మూడవసారి గర్భవతి అయిన స్త్రీలలో, బంప్ త్వరగా, మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
శిశువు స్థానం: శిశువును వెనుక వైపుకు అంటే వెన్నెముక వైపుకు వంచి ఉంచినట్లయితే, అప్పుడు బాహ్య ఉబ్బరం ఏర్పడదు.
అధిక బరువు లేదా ప్లస్-సైజు: మీరు అధిక బరువుతో ఉంటే, కొవ్వు పొర బేబీ బంప్‌ను కప్పి ఉంచడం వల్ల బేబీ బంప్ అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు.
ఈ పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందా?
సాధారణంగా, అల్ట్రాసౌండ్, ఇతర చెకప్‌లు సాధారణంగా ఉన్నంత వరకు బేబీ బంప్ లేకపోవడం ప్రమాదకరం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. గర్భాశయ పెరుగుదల రిటార్డేషన్ లో శిశువు గర్భంలో సరిగ్గా పెరగకపోతే సమస్య వస్తుంది. అమ్నియోటిక్ ద్రవం తగ్గినా సరే ప్రమాదమే. బొడ్డులో ద్రవం పరిమాణం తగ్గితే కూడా బేబీ బంప్ప చిన్నగా కనిపించవచ్చు. ప్రొజెస్టెరాన్ లేదా ఇతర హార్మోన్ల అసమతుల్యత పిండం అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
5వ నెల తర్వాత కూడా బేబీ బంప్ కనిపించకపోతే, మీకు కదలికలు తెలియకపోతే లేదా వాంతులు, అలసట వంటి సాధారణ గర్భధారణ లక్షణాలు లేకపోతే వైద్యుడిని సంప్రదించాలి. మీ కడుపు మునుపటితో పోలిస్తే కుంచించుకుపోయినట్లు అనిపిస్తే కూడా మీరు వైద్యులను సంప్రదించాలి.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.