Constipation : ప్రస్తుత కాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్య ఉంటోంది. మనం తీసుకునే ఆహారాలతోనే మనకు ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏది తిన్నా సరిగా జీర్ణం కాకపోవడంతో కడుపు ఉబ్బరంగా మారుతుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే అనర్థాలపై చొరవ చూపకపోతే ఇంకా సమస్యలు తీవ్రమవుతాయి.
మలబద్ధకం ఎందుకు వస్తుంది?
మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుందంటే మనం తిన్న ఆహారాలు కడుపులో పూర్తిగా అరగకపోతే అజీర్తి ఏర్పడుతుంది. ఇది తీవ్రమైతే అర్షమొలలకు దారి తీస్తుంది. దీంతో మలంతో రక్తం పడుతుంది. అందాక వస్తే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతటి ప్రమాకరమైన మలబద్ధకం నుంచి మనం బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
చిట్కా ఎలా తయారు చేసుకోవాలి
మలబద్ధకం నుంచి బయట పడాలంటే ఓ చిట్కా ఉంది. 200 గ్రాముల సోంపు, 50 గ్రాముల సుక్ ముక్, 20 గ్రాముల నల్ల ఉప్పు, 50 గ్రాముల నువ్వులు, 50 గ్రాముల వాము తీసుకుని పొడి చేసుకోవాలి. భోజనం చేసిన తరువాత ఈ పొడి ఓ చెంచా తీసుకుంటే మలబద్ధకం సమస్య రాకుండా పోతుంది. దీని వల్ల మనకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇలా సులభమైన చిట్కా ఉపయోగించుకుని గ్యాస్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అన్నం తిన్నాక ఒఖ చెంచా దీన్ని తీసుకుంటే మలం సులభంగా వస్తుంది. గ్యాస్ సమస్యలు రావు.
ఏ ఆహారాలు తీసుకోవాలి
మలబద్ధకం సమస్య రాకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రైడ్ పదార్థాలు తీసుకోకూడదు. మాంసాహారాలు కూడా ఎక్కువగా తినకూడదు. మసాలాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఇంకా వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుంది.