Peanut : భారతదేశం సంప్రదాయాలకు, రకరకాల వంటకాలకు పుట్టినిల్లు. ఉద్యోగం లేదా చదువు కోసం దేశాన్ని విడిచి వెళ్లిన వాళ్లు ఇండియా సంప్రదాయాలు, వంటకాలను ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు. భారతీయ వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వేరే దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ టిఫిన్స్‌లో రోజూ చేసుకునే వాటిలో పల్లీ చట్నీ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలామంచిది. మరి వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ చట్నీని ఎలా తయారు చేస్తే రుచిగా ఉంటుందో తెలుసుకుందాం.
వేరుశనగ గింజలు శరీరానికి బలాన్నిస్తాయి. వీటితో తయారు చేసిన బిస్కెట్లు, చాక్లెట్లు, చక్కీలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోజూ వీటిని ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇందులోని పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. అలాగే అలెర్జీలు రాకుండా కాపాడుతాయి. వేరుశనగలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు సాయపడుతుంది. అలాగే కీళ్లు నొప్పులు, మోకాల నొప్పులు రాకుండా కాపాడుతుంది.
వేరుశనగలో ఉండే అమినో యాసిడ్స్ వల్ల మెదడు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ కణాలను నశింపచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసెలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. అలాగే మొటిమలు రాకుండా చేస్తుంది. రాత్రిపూట వేరుశనగ గింజలను నానబెట్టి ఉదయాన్నే తింటే బరువు పెరగడంతో పాటు బలంగా తయారవుతారు. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతోపాటు మానసిక స్థితి కూడా మెరగుపడుతుంది. ఇందులోని ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడటంతో పాటు జీర్ణ సమస్యల నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. దీనివల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.
పల్లీ చట్నీని తయారు చేసేముందు ప్యాన్‌లో వేయించుకోవాలి. ఇందులో ఆయిల్, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. వీటిలో సరిపడా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే చట్నీ టేస్టీగా ఉంటుంది. ఉదయంపూట టిఫిన్స్‌కి పల్లీ చట్నీ చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. సాయంత్రం వేళలో ఫాస్ట్‌ఫుడ్ తినేబదులు పల్లీను ఊడికించి అందులో ఉల్లిపాయలు, టమాటా, నిమ్మరసం, మసాలా వేసి తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతో కొత్తగా ఇలా ట్రై చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తింటారు.
Web Title: So many benefits of peanuts they have not been used for years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com