Bombay Rava: ప్రస్తుతం ఆరోగ్యం పెద్ద సవాలుగా మారుతుంది. మారుతున్న జీవన శైలి, వాతావరణం, ఆహార అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సిందే. రసాయనాలతో కూడిన ఆహారాల వల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ ఫ్రై చేసిన ఆహారం, మాసాలు తినడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కానీ ఒకసారి మీరు మీ ఆహారంలో మంచి డైట్ ను పాటిస్తే కచ్చితంగా ఆస్పత్రి వెళ్లాల్సిన అవసరం రాదు అంటున్నారు నిపుణులు.
వంటింట్లో చాలా మంది రవ్వను ఉపయోగిస్తుంటారు. అందులో ముఖ్యంగా బొంబాయి రవ్వ ఉంటుంది. మరి ఈ బొంబాయి రవ్వలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే కచ్చితంగా మీ డైట్ లో భాగం చేసుకుంటారు. మరి ఓసారి తెలుసుకుందామా? బొంబాయి రవ్వలో కాల్షియం, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు మరింత మేలు చేస్తాయి. అరబొనాక్సినిన్ అనే శక్తివంతమైన ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే బొంబాయి రవ్వాను మీ డైట్ లో భాగం చేసుకోండి.
అరబొనాక్సినేట్లు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఇక షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది కాబట్టి బొంబాయి రవ్వ షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. ఇందులోని మెగ్నీషియం, టొకొఫెరోల్, ఫెనాన్స్ రక్తపోటును నియంత్రింస్తుంది. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇక ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ సమస్యలను నయం చేస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య కూడా దూరం అవుతుంది. ఇందులో ఉండే ఫాస్పరస్ ఎముకలను బలంగా ఉంచుతుంది.
ఫాస్పరస్ వల్ల మీ దంతాల ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. మరి కేవలం ఉక్మా అని తీసి పారేస్తున్నారా? ఒక్కసారి బొంబాయి రవ్వను తింటే మీకు వచ్చే ఎన్నో సమస్యలకు మీరు చెక్ పెట్టవచ్చు. ఇలాంటి రవ్వను ఛీ, ఉక్మా అంటూ పక్కన పెడుతుంటారు. ఉక్మా లేదా మరే ఇతర పదార్థాలు అయినా చేసుకొని తినండి. మీ ఆరోగ్యాన్ని తక్కువ ధరతోనే సేఫ్ గా ఉంచుకోండి.