Sleep Less: మారుతున్న కాలంతో పాటే మనిషి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఆలోచనా తీరు మారుతోంది. పని ఒత్తిడి వల్ల కొంతమంది తక్కువ సమయం నిద్రపోతున్నారు. కొంతమంది రోజుకు 3 నుంచి 4 గంటల పాటు నిద్రపోతూ మిగతా సమయం పనికే పరిమితవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు కూడా మనిషి నిద్రకు దూరం కావడానికి పరోక్షంగా కారణమవుతున్నాయి. అయితే రోజుకు 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
తక్కువ నిద్ర ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుంది. 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే పనిని ఆసక్తిగా చేయడం సాధ్యం కాదు. ఎవరైతే రాత్రి సమయంలో తక్కువ సమయం నిద్రపోతారో వాళ్లను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తక్కువ నిద్ర వల్ల శారీరక ప్రక్రియలు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. తక్కువ నిద్ర వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
Also Read: రాజ్యాంగం మార్చండి కేసీఆర్ గారూ.. కానీ..!
తక్కువ సమయం నిద్రపోయే వారికి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. తక్కువగా నిద్రపోయే వారికి రోగనిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. క్యాన్సర్, డయాబెటిస్, ఊబకాయం లాంటి సమస్యలకు తక్కువ నిద్ర కూడా ఒక కారణమని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా ఒక విధంగా తక్కువ నిద్రకు కారణమవుతోంది.
తక్కువ సమయం నిద్రపోయేవాళ్లు ప్రణాళికను మార్చుకుని ఎక్కువ సమయం నిద్రపోయే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యంగా లైఫ్ లాంగ్ జీవించాలని భావించే వాళ్లకు తక్కువ నిద్ర ఏ మాత్రం మంచిది కాదు.
Also Read: కేంద్రంపై జగన్ వైఖరి మార్చుకోవాల్సిందే.. ఆ విషయాలపై ప్రశ్నించకుంటే కష్టమే..!