Garuda Puranam : మనం చేసే పాపాలు, పుణ్యాల గురించి గరుడ పురాణంలో ఉంటుంది. ఒక్కో పాపానికి ఒక్కో రకమైన శిక్ష ఉంటుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో స్పష్టంగా వివరిస్తుంది. ఏ తప్పుకు ఏ శిక్ష అని సూచించబడింది. చనిపోయిన తరువాత మనకు వేసే శిక్షలు తెలియజేస్తుంది. తీవ్రమైన తప్పులకు కఠినమైన శిక్ష, మామూలు వాటికి సరళమైన శిక్షలు వేస్తుంటారని చెబుతుంది. ఇలా గరుడ పురాణం హిందూ మతంలో ఉన్న మరో మంచి గ్రంథం ఇది. దీంతో గరుడ పురాణం ప్రతి ఒక్కరూ చదవాల్సిందే.
గరుడ పురాణాలు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి 108 అధ్యాయాలతో శ్రీరంగక్షేత్ర విశిష్టతను తెలియజేస్తుంది. సుమారు ఇరవై వేల శ్లోకాలతో శ్రీ మహావిష్ణువు గరత్మంతుడికి వివరించిన మరో గ్రంథం కూడా గరుడ పురాణమే. గరుడ పురాణంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అందులో ఉన్నవి నిజాలా కాదా అనే సందేహాలు వస్తుంటాయి.
కొందరు మాత్రం గరుడ పురాణం ఇంట్లో ఉంచుకుంటే అనర్థాలు వస్తాయని చెబుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. గరుడ పురాణంలో మనం చేసే పాపాలేంటి? వాటికి శిక్షలేంటి అనే వాటిని గురించే చెబుతుంది. గరుడ పురాణం చదివితే మనకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు చదవాల్సిన గ్రంథం గరుడ పురాణం.
గరుడ పురాణంపై ఎవరో చెబుతున్న మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా దీన్ని మన ఇంట్లో ఉంచుకోవచ్చు. పాపపుణ్యాలపై ఇది ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. మనం జీవితంలో చేయకూడని పనులు కూడా చేస్తుంటాం. ఏ పనులు చేస్తే ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందనే వాటిపై గరుడ పురాణం స్పష్టంగా వివరిస్తుంది. దీంతో గరుడ పురాణం ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.