Figs: అత్తి పండ్లు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లు అస్సలు తినకూడదట!

Figs:  కరోనా కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. అంజీర్ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయనే సంగతి తెలిసిందే. అంజీర్ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ పండ్లు తినడం వల్ల ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అత్తి పండ్లు పొట్టకు మంచివి అనే సంగతి తెలిసిందే. ఎవరైతే గ్యాస్ సమస్యలతో బాధ పడుతూ ఉంటారో […]

Written By: Navya, Updated On : January 6, 2022 10:45 am
Follow us on

Figs:  కరోనా కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. అంజీర్ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయనే సంగతి తెలిసిందే. అంజీర్ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ పండ్లు తినడం వల్ల ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అత్తి పండ్లు పొట్టకు మంచివి అనే సంగతి తెలిసిందే.

ఎవరైతే గ్యాస్ సమస్యలతో బాధ పడుతూ ఉంటారో వాళ్లు అత్తి పండ్లకు దూరంగా ఉంటే మంచిది. గ్యాస్ సమస్యతో బాధ పడేవాళ్లు అత్తి పండ్లను తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అపానవాయువు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే అత్తిపండ్లను ఎక్కువగా తీసుకుంటారో వాళ్లకు రక్తస్రావం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం సమస్యతో బాధ పడేవాళ్లు అత్తిపండ్లు తినకూడదు.

అత్తి పండ్లను మైగ్రేన్ సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం తినకుండా ఉంటే మంచిది. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో ఉండే సల్ఫైట్ సమస్యను మరింత పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో మైగ్రేన్ సమస్యతో బాధ పడేవాళ్లు అత్తి పండ్లకు దూరంగా ఉంటే మంచిది. కొన్నిసార్లు అత్తిపండ్లు కాల్షియం లోపానికి కారణం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అత్తి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపానికి దారితీస్తుంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు సైతం అత్తి పండ్లను తీసుకోకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు అత్తి పండ్లను తీసుకుంటే అందులో ఉండే ఆక్సలేజ్ వారికి సమస్యను పెంచుతుందని గుర్తించుకోవాలి. అత్తి పండ్ల వల్ల లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఈ పండ్లను తీసుకునే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.