Sugar Apple: పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం పండ్లు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వైద్య నిపుణులు సైతం అనారోగ్యంతో బాధపడే వాళ్లకు సీతాఫలం పండ్లు తినాలని సూచనలు చేస్తారు. మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు శరీరానికి అవసరమైన కాపర్, ఫైబర్, పొటాషియం సీతాఫలం ద్వారా లభిస్తాయి.
సీతాఫలంలో శరీరానికి అవసరమైన ఐరన్ ఉంటుంది. సీతాఫలాన్ని తీసుకోవడం ద్వారా వికారం సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సీతాఫలంను తింటే కడుపు నొప్పి, పేగుల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సీతాఫలం ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలని చాలామంది సలహా ఇస్తారు. అయితే ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అయితే కొంతమందికి సీతాఫలం వల్ల దురద, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సీతాఫలం తిన్న వెంటనే అలెర్జీ, దురద సమస్యలు వస్తే ఆ పండుకు దూరంగా ఉండాలి. ఇప్పటికే అలర్జీ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ పండుకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.