Beetroot Effects: ప్రస్తుత కాలంలో బీట్ రూట్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ బీట్ రూట్ తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే బీట్ రూట్ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహ రోగులు బీట్ రూట్ తినకూడదు. మధుమేహ రోగులు బీట్ రూట్ తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీట్ రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో పాటు డయాబెటిక్ సమస్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు కూడా బీట్ రూట్ తినకూడదు. బీట్ రూట్ లో ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు బీట్ రూట్ తినకూడదు. బీట్ రూట్ తినడం వల్ల రక్తపోటు ఉండాల్సిన స్థితి కంటే తగ్గే అవకాశం ఉంటుంది. రక్తపోటుతో బాధ పడేవాళ్లు బీట్ రూట్ కు దూరంగా ఉంటే మంచిది. చర్మంపై దద్దుర్లు, అలెర్జీ సమస్యతో బాధ పడేవాళ్లు బీట్ రూట్ ను తినకూడదు.
Also Read: ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్.. ఏం చేయాలంటే?
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు బీట్ రూట్ హానికరంగా మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే బీట్ రూట్ వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. బీట్ రూట్ తినడం ద్వారా కంటిచూపు సమస్యలను సులభంగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. రోజూ బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, ఇతర పోషకాలు లభిస్తాయి.
బీట్ రూట్ తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బీట్ రూట్ లో ఉండే బీటాసైయానిన్ క్యాన్సర్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు బీట్ రూట్ శరీరానికి హానికరంగా మారే అవకాశం ఉండటంతో వైద్యుల సలహాలను తీసుకుని బీట్ రూట్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు… చేస్తే సమస్యలు తప్పవు!