దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ సమయంలో కరోనా ప్రజల్ని మరింత భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. మధుమేహం వచ్చిన వాళ్లు ఎక్కువ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లు మధుమేహం బారిన పడే అవకాశం అయితే ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వెల్లడిస్తున్నారు. కరోనా చికిత్స కోసం వినియోగించే స్టెరాయిడ్స్ వల్ల మధుమేహం వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుని షుగర్ లెవెల్స్ ను పరీక్షించుకుంటే మంచిదని చెప్పవచ్చు. ముంబై , పూణే నగరాలలో కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఎక్కువమంది షుగర్ బారిన పడుతున్నారు. సాధారణంగా స్టెరాయిడ్స్ ను వినియోగించడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అలసట, తరచుగా మూత్రవిసర్జన, దృష్టి మసకబారడం, శరీరంలో గాయాలు మానకపోవడం సమస్యలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.
కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచే అవకాశం ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఆహారం, పానీయాల విషయంలో సంయమనం పాటించడం ద్వారా మధుమేహం రాకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకుంటే మధుమేహం దూరమవుతుంది.
మధుమేహం ఒకసారి వస్తే పూర్తిస్థాయిలో నయం కావడం సులభం కాదు. మధుమేహం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.