https://oktelugu.com/

Corona Vaccine: ఆ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి అత్యంత రక్షణ.. శాస్త్రవేత్తల వెల్లడి!

Corona Vaccine: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపలేదనే సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో చాలామందిపై వైరస్ ప్రభావం ఎక్కువగా లేదు. కోవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో రోగనిరోధక ప్రతిస్పందనలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకోవడం ద్వారా ఆందోళనకర వేరియంట్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 8, 2022 / 09:54 AM IST
    Follow us on

    Corona Vaccine: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపలేదనే సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో చాలామందిపై వైరస్ ప్రభావం ఎక్కువగా లేదు. కోవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో రోగనిరోధక ప్రతిస్పందనలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకోవడం ద్వారా ఆందోళనకర వేరియంట్లకు సులువుగా చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐ.సీ.ఎం.ఆర్ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. వేర్వేరు వయస్సుల వారిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కరోనా వ్యాక్సిన్ తీసుకొని పాజిటివ్ వచ్చిన వారిలో రోగనిరోధక స్పందనలు ఏ విధంగా ఉన్నాయో అధ్యయనం నిర్వహించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

    కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్లలో 43 రోజుల తర్వాత బ్రేక్ త్రూ కేసులు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వైరస్ నిర్ధారణ అయితే కొందరిలో అసలు లక్షణాలు కనిపించడం లేదని మరి కొందరిలో లక్షణాలు కనిపించినా తక్కువగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా సోకిన తర్వాత కోవాగ్జిన్ తీసుకున్న వాళ్లకు కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ స్థాయిలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

    కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వల్ల లభించే ఇమ్యూనిటీ పవర్ క్రమంగా తగ్గుతోందని బూస్టర్ డోస్ ను తీసుకోవడం ద్వారా ఆందోళనకర వేరియంట్లకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.