దేశ ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ తో రెండేళ్లు ఇమ్యూనిటీ పవర్..?

దాదాపు 12 నెలల పాటు కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు శాస్త్రవేత్తలు వరుస శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కొన్ని నెలల పాటు మాత్రమే ఆ యాంటీబాడీలు శరీరంలో ఉంటాయని వార్తలు వచ్చాయి. అయితే రష్యా శాస్త్రవేత్తలు మాత్రం తమ కరోనా వ్యాక్సిన్ ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఇమ్యూనిటీ పవర్ ను ఇస్తుందని వెల్లడించారు. Also Read: ఈ అలవాట్లు మీకు ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్లే..? గమలేయా […]

Written By: Navya, Updated On : December 16, 2020 1:44 pm
Follow us on

దాదాపు 12 నెలల పాటు కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు శాస్త్రవేత్తలు వరుస శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కొన్ని నెలల పాటు మాత్రమే ఆ యాంటీబాడీలు శరీరంలో ఉంటాయని వార్తలు వచ్చాయి. అయితే రష్యా శాస్త్రవేత్తలు మాత్రం తమ కరోనా వ్యాక్సిన్ ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఇమ్యూనిటీ పవర్ ను ఇస్తుందని వెల్లడించారు.

Also Read: ఈ అలవాట్లు మీకు ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్లే..?

గమలేయా రీసెర్చ్ సెంటర్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ గురించి ఈ ప్రకటన చేసింది. దీంతో స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ కరోనా వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపాయి. స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులుగా ఇస్తారు. మొదట కరోనా వ్యాక్సిన్ ను ఇచ్చిన తరువాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి రెండో డోస్ ఇస్తారు.

Also Read: పెళ్లి కాని వారికే కరోనాతో ప్రమాదం.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉండదు. వ్యాక్సిన్ ను తయారు చేసిన కంపెనీ హెడ్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఇతర్ వ్యాక్సిన్లతో పోలిస్తే తమ వ్యాక్సిన్ పనితీరు ఎంతో మెరుగ్గా ఉందని.. పలు వ్యాక్సిన్లు నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం ఇమ్యూనిటీ పవర్ ను ఇవ్వలేకపోయాయని చెబుతున్నారు. రష్యా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో జరగనున్నాయి. మరోవైపు ఇతర వ్యాక్సిన్లు కూడా అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే వైరస్ ను కట్టడి చేయడం సులువుగా సాధ్యమవుతుంది.