Male Fertility: ప్రస్తుతం ప్రపంచంలో పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోంది. ఫలితంగా జనాభా పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలనే పొందుతోంది. దీంతో జనాభా పునరుత్పత్తి ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ లో ఇది మరింత రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సంతానోత్పత్తి సమస్య జఠిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యవసానంగా జంట్లో భయాందోళనలు కలుగుతున్నాయి. తమ వారసుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నా ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.

సంతానోత్పత్తిలో స్పెర్మ్ కౌంట్ ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనం తీసుకునే ఆహారంతో శుక్రకణాల సంఖ్య కూడా తగ్గుతున్నట్లు సమాచారం. శుక్రకణాల సంఖ్య తగ్గుతుండటంతో సంతానోత్పత్తి జరగడం లేదు. ఫలితంగా శుక్రకణాల సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై కొత్తగా పెళ్లయిన జంటలు పట్టించుకుని తద్వారా నివారణ చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: CM Jagan- Early Elections: 2023 మార్చిలోపే షాకివ్వడానికి జగన్ రెడీ!
పిల్లలు కలగకపోవడానికి గల కారణాలపై ఆడవారు పరీక్షలకు మొగ్గు చూపినా మగవారు మాత్రం భయపడుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని తెలిస్తే అత్తింటి వారి నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తలుచుకుని కంగారు పడుతుంటారు. అందుకే వైద్య పరీక్షలకు వెనుకాడుతుంటారు. మహిళలు మాత్రం పరీక్షలకు జంకడం లేదని తెలుస్తోంది. పురుషులైతే స్పెర్మ్ కౌంట్ కోసం భయపడుతూ పరీక్షలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కూడా పలు జంటల్లో సంతానోత్పత్తి ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. దీంతో పిల్లలు కలగడం లేదు. దీనిపై నిర్లక్ష్యం తగదని వైద్యులు సూచిస్తున్నారు. లోపం ఎవరిలో ఉన్నా పరీక్షలు చేయించుకుని మందులు వాడి సంతాన భాగ్యం పొందాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. లేకపోతే వయసు పెరుగుతున్న కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి. వయోభారం పెరిగితే సంతాన సాఫల్యం కూడా దెబ్బతింటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్లు వయసులో ఉండగానే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటేనే ప్రయోజనం ఉంటుందనే విషయం గ్రహించుకోవాలి.
Also Read:Telangana BJP- Congress: కమలంలో నిస్తేజం.. కాంగ్రెస్‌లో కనిపించని చేరికల జోష్..!!