Sri Rama Navami: హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి పండుగ ఒకటనే సంగతి తెలిసిందే. శ్రీరామనవమి పండుగ రోజున దేశంలోని చాలా ఆలయాలలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఉగాది పండుగ వచ్చిన తొమ్మిదిరోజుల తర్వాత ఈ పండుగ వస్తుంది. తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ఒంటిమిట్ట ప్రాంతాలలో సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పండుగ రోజున ఉదయం 11 గంటల 6 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 39 నిమిషాల వరకు శుభ ముహూర్తంగా ఉంది.
మనదేశంలోని హిందువులలో చాలామంది యూపీలోని అయోధ్యలో రాముడు జన్మించాడని విశ్వసిస్తారు. శ్రీరాముడు చైత్రమాసంలో నవమి రోజున జన్మించారనే సంగతి తెలిసిందే. శ్రీరామనవమి పండుగ రోజున తెల్లవారుజామున నిద్రలేచి నూతన వస్త్రాలను ధరించి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉంటాయి.
పండుగ రోజున మద్యమాంసాలకు దూరంగా ఉండటంతో పాటు జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు. పూజ సమయంలో చెప్పులను ధరించకూడదు. పండుగ సమయంలో శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి. పండుగ రోజున ఉపవాసం ఉన్నవాళ్లు ద్రవ పదార్థాలను తీసుకుంటే మంచిది. పండుగరోజున అఖండ దీపం వెలిగించడంతో పాటు దుర్గా సప్తశతి, దుర్గా చాలీశా చదివితే మంచిది.
పండుగ సమయంలో ఇతరుల విషయంలో జాలి, దయ కరుణతో వ్యవహరించాలి. పండుగ రోజున “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే” అనే శ్లోకంను స్మరించడం ద్వారా శుభఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది. శ్రీరామనవమి పండుగను జరుపుకునే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.