Summer Precautions: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏసీలు, కూలర్లు మోత మోగుతున్నాయి. ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఫలితంగా ఎండ వేడి రెట్టింపవుతోంది. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనసంచారం కనిపించడం లేదు. ఎండ భయానికి అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు.
ఎండ వేడికి చాలా దుష్ఫలితాలు కలుగుతాయి. శరీరం నీరసించిపోతుంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వడదెబ్బ సోకితే శరీరం డీహైడేషన్ కు గురవుతుంది. దీంతో ప్రాణాలే పోతాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నీరుఎక్కువగా తీసుకోవాలి. ద్రవ పదార్థాలనే పెద్ద మొత్తంలో తింటుండాలి. ఎండ తీవ్రత పెరిగితే చెమట పొక్కులు, సెగ గడ్డలు ఏర్పడతాయి.
Also Read: Return To Office: వర్క్ ఫ్రం హోం తరువాత ఆఫీసుకు వెళ్తున్నారా? అయితే ఇవి పాటించాల్సిందే
శరీరంలో లవణాలు తగ్గిపోవడంతో నిస్సత్తువ ఆవహిస్తుంది. గంటకోసారి కనీసం 300 మి.లీ నీటిని తాగుతుండాలి. మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లరాదు. ఒక వేళ అత్యవసరమైతే ఏదైనా గొడుగు పట్టుకోవాలి. లేదంటే టోపీ ధరించి ఎండ తగలకుండా చూసుకోవాలి ఎండ నుంచి రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి.
ఖద్దరు దుస్తులు ధరించాలి. ఎండలకు ఆహార పదార్థాలు తొందరగా పాడయ్యే ప్రమాదమున్నందున ఏ పూటకు ఆ పూటే వండుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతి. మసాలా ఆహారాలు తగ్గించాలి. నూనె పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఎండాకాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మన ారోగ్యం అదుపులో ఉంటుంది సుమా. తస్మాత్ జాగ్రత్త. అప్రమత్తతే శ్రీరామరక్ష.
Also Read:KTR- Congress Party: కాలం చెల్లిన పార్టీతో పొత్తా? కాంగ్రెస్ కు చురకలంటించిన కేటీఆర్
Recommended Videos: