Power Saving Tips: సాధారణంగా ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవికాలంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే సంగతి తెలిసిందే. ఫ్యాన్, ఏసీలను ఎక్కువగా వినియోగించడం వల్ల వేసవిలో కరెంట్ బిల్లు ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అంతకంతకూ పెరగడం కూడా కరెంట్ బిల్లు ఎక్కువ మొత్తంలో రావడానికి ఒక విధంగా కారణమవుతోందని చెప్పవచ్చు.
అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వేసవిలో కరెంట్ బిల్లును సులభంగా తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కరెంట్ బిల్లును తగ్గించుకోవడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై ఊహించని స్థాయిలో భారం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో ఏసీని వినియోగించే వాళ్లు వేసవిలో ఏసీని 24 డిగ్రీల దగ్గర ఉంచాలి.
ఏసీని 16 డిగ్రీల దగ్గర ఉంచితే మాత్రం కరెంట్ బిల్ ఊహించని స్థాయిలో పెరుగుతుందని చెప్పవచ్చు. ఇంట్లో ఎల్.ఈ.డీ బల్బులను వినియోగించడం ద్వారా కూడా సులభంగా కరెంట్ బిల్లును ఆదా చేయవచ్చు. ఇతర బల్బులతో పోల్చి చూస్తే ఎల్.ఈ.డీ బల్బులు తక్కువ కరెంట్ ను వినియోగించుకుంటాయి. టీవీలను వినియోగించని సమయంలో పవర్ స్విచ్ ను ఆఫ్ చేయడం ద్వారా కూడా కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.
ఏసీ అవుట్ డోర్ యూనిట్ ను నీడ ప్రాంతంలో ఉండేలా చూసుకోవడం ద్వారా కరెంట్ బిల్లు తగ్గుతుంది. ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ ను వాడటం ద్వారా కూడా సులభంగా కరెంట్ ను ఆదా చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫ్రిజ్ ను వెంటిలేషన్ ఉండే ప్రాంతంలో ఉంచడం ద్వారా కూడా కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.