Homeహెల్త్‌Sugarcane Juice: ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగొద్దు!

Sugarcane Juice: ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగొద్దు!

Sugarcane Juice: వేసవి కాలం వచ్చేసింది. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడి తట్టుకోలేక శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. అయితే చాలా మంది తక్కువ ధరకు వచ్చే చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. గ్లాసుల కొద్దీ చెరకు రసం లాగించేస్తారు. కూల్‌ డ్రింక్స్‌ తాగేవారూ ఎక్కువగానే ఉన్నారు. రోడ్ల పక్కన చెరకు రసం బండ్లు చూడగానే వెళ్లి తాగుతుంటారు.

ఆరోగ్యానికి మంచిది..
చెరకు రసం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు దరి చేరవు. అలసటను తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తుంది. నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా మారతారు. చెరకు రసంలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్‌ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్‌ ఫైబర్‌ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది.

వీరు అస్సలు తాగొగ్గు..
అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

= అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్‌ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

= డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు విటమిన్‌ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి.

= కొన్ని చోట్ల రెరెకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్‌ పాయిజనింగ్‌ బారిన పడే ప్రమాదం ఉంది.

= జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు.

ఆరోగ్యవంతులు కూడా..
ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కానీ రోజూ చెరకు రసం తాగకూడాదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular