Diabetes: ఈ రోజుల్లో మధుమేహం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి వస్తోంది. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లు, జీవన శైలి మార్చుకోవాలి. లేకపోతే ఇబ్బందులు రావడం ఖాయం. డయాబెటిస్ వచ్చిన వారు కచ్చితంగా వ్యాయామం చేయాలి. జీవన విధానం నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదిపడితే అది తినడం వల్ల సమస్యలొస్తాయి. షుగర్ బారిన పడితే కొన్ని ఆహారాలు తినకూడదు. కొన్నింటిని వదిలిపెట్టకూడదు.
షుగర్ ను కంట్రోల్ లో..
చక్కెరను కంట్రోల్ లో ఉంచుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. అదే సందర్భంలో కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. మధుమేహం ఉన్న వారు చేయకూడదని తప్పులు తెలుసుకుని జాగ్రత్తగా ఉండకపోతే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే నష్టాలు రావడం సహజం. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వారు అప్రమత్తంగా ఉండాలి.
వ్యాయామం
చక్కెర స్థాయిల గురించి నెలకోసారి చెక్ చేసుకోవాలి. దీంతో వాటి స్థాయి ఎలా ఉందో తెలుస్తుంది. మనం అప్రమత్తంగా లేకపోతే మన అవయవాలపై పెను ప్రభావం పడుతుంది. దీంతో ఇక మనకు ఇబ్బందులు తప్పవు. అందుకే రోజు వ్యాయామం చేయాలి. రోజులో కనీసం 45 నిమిషాలైనా నడవాలి. అప్పుడే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. లేదంటే ఎక్కువ తక్కువ అయితే పరేషాన్ పడాల్సి ఉంటుంది.
మద్యపానం చేయకూడదు
మధుమేహం ఉన్న వారు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం తాగడం వల్ల ఊబకాయం, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముంది. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డయాబెటిస్ వారు ఉప్పు, చక్కెర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని అసలు వాడకపోవడమే బెటర్. వాటితో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతాయి.
మంచి ఆహారాలు
మధుమేహులు ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. షుగర్ కంట్రోల్ లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు. సరైన సమయానికి మందులు వేసుకుని సరైన ఆహారం తీసుకుంటే షుగర్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ముప్పు ఉండదు. డయాబెటిక్ పేషెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.