Diabetes: ఈ మధ్య కాలంలో చాలామంది చిన్నవయస్సులోనే షుగర్ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మధుమేహం వచ్చిన వాళ్లలో శరీరానికి అవసరమైన స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇన్సులిన్ తోడ్పడుతుంది. ఎవరైతే షుగర్ తో బాధ పడుతుంటారో వాళ్లను కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం వేధిస్తాయి.
కిడ్నీలు శరీరంలో రక్తపోటును నియంత్రించడంతో పాటు శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపుతాయి. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాని వారిలో షుగర్ లెవెల్స్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. షుగర్ లెవెల్స్ పెరిగితే రక్త నాళాలు చిట్లిపోయే అవకాశంతో పాటు కిడ్నీలపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. షుగర్ లెవెల్స్ పెరిగితే కొంతమందిని యూరిన్ సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
Also Read: Jayalalitha Shoban Babu Daughter: జయలలిత, శోభన్ బాబు కూతురుని నేనే.. ఆధారాలు ఉన్నాయంటున్న మహిళ..
మధుమేహంతో బాధ పడేవాళ్లు కిడ్నీ సంబంధిత సమస్యలను అధిగమించాలంటే పెయిన్ కిల్లర్స్ ను పరిమితంగా తీసుకోవాలి. పొగ తాగడం, పొగాకు నమలటానికి దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు సమస్య బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతుంటే వైద్యులను సంప్రదించి ఆ సమస్యకు తగిన మందులు వాడాలి.
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తుంటే మాత్రం వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: TRS Party Dissent: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?