Parenting Problems: ఈ రోజుల్లో సంతానం పెద్ద సమస్య అయిపోయింది. చాలామందికి సహజంగా సంతానం కలగడం లేదు. దేవుడు మనిషికి ఇచ్చిన సహజమైన ప్రక్రియ సంతానోత్పత్తి. చివరకు దానిలో కూడా మనిషి తన అతి తెలివినో, లేక.. తన మూర్ఖత్వాన్నో చూపించి.. సహజంగా జరగాల్సిన విషయాన్ని కూడా కృత్రిమంగా తయారు చేసుకున్నాడు.
సరే.. ఈ సంతాన సమస్య కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. కాబట్టి.. ముందు వాటిని పాటించి ఆ తర్వాత కృత్రిమంగా ప్రయత్నాలు చేయండి. మరి ఆ అద్భుతమైన చిట్కాలు ఏమిటో చూద్దామా.
మీకు సంతానం కలగాలి అంటే.. గుమ్మడి కూరను తప్పకుండా తినండి. గుమ్మడి కూరకు సంతానాన్ని కలిగించే శక్తి ఉంది.
Also Read: మొత్తానికి సౌందర్య, ఆనందరావులను చూసిన కార్తీక్, దీప!
అలాగే, గుండె సమస్యలు ఉన్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనితో కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచ్చు, విటమిన్‌లు గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. అలాగే అందులో పొటాషియం అధికర రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకు తల్లి కావాలనుకునేవారు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వడియాలు చేసుకుని వేపుకుని తినేకన్నా… కూరగా తింటేనే మంచి ఫలితం ఉంటుంది. గుమ్మడి గింజలు తిన్నా చాలా మంచిది. హార్మోన్ల అసమతుల్యతను తగ్గిండానికి కూడా ఇది సహకరిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచి, వైరస్ లు, ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా చూస్తుంది.
ఇక గుమ్మడి గింజలు తింటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.