Sleep Problems: ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. నైట్ డ్యూటీలు, రాత్రి ఫోన్ లు, పార్టీలు అంటూ నిద్ర పోకుండా మెలుకువతో ఉంటున్నారు. దీని వల్ల తర్వాత కూడా నిద్ర పట్టడం లేదు. అయితే నిద్ర లేకపోవడం వల్ల, నిద్రలేమి సమస్య సులభంగా వస్తుంది. దీని వల్ల గుండె సమస్య కూడా వస్తుంది. అంతేకాదు మానసిక, శారీరక సమస్యలు.. సహా పలు తీవ్ర వ్యాధులకు కారణం కూడా అవుతుంది. వాస్తవానికి ఆరోగ్యంగా ఉండాలంటే.. 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి.. మరి మీకు సరైనా నిద్ర లేకపోతే ఎలాంటి ప్రమాదాలు, వ్యాధులు వస్తాయో తెలుసుకోండి.
ఎవరైనా 8 గంటలు నిద్రపోకపోతే, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది అంటున్నారు నిపుణులు. దీంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుందట. తద్వారా రక్తపోటు పెరిగి.. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. అంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల వాపు, ఒత్తిడిని పెంచే హార్మోన్లు శరీరంలో పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. ఈ వాపు ధమనికి హాని కలిగిస్తుందట. దీని వల్ల కూడా గుండె జబ్బులు పెరుగుతాయట.
నిద్ర లేకపోవడం వల్ల, గుండె కొట్టుకోవడం సక్రమంగా ఉండదని.. చప్పుడులో మార్పు సంభవించే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. దీనిని అరిథ్మియా అని పిలుస్తారట. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని.. అందుకే రాత్రి పూట వీలైనంత త్వరగా పడుకోవాలి అని సలహా ఇస్తున్నారు వైద్యులు.
రాత్రి పూట మెలుకువగా ఉంటే తినడం కూడా బాగా అలవాటు అవుతుంది. దీని వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. ఇలా జరగడం వల్ల తినడం, ఆ తర్వాత ఉచితంగా ఊబకాయం రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక బరువు.. కావున జీవనశైలిలో మార్పు చేసుకుంటే ఈ గుండె జబ్బులు కూడా తక్కువ అవుతాయి.