Bald Head Drug: బొచ్చు లేనమ్మ బోడిగుండే నమమనుకుందట. బట్టగుండు వారు భాగ్యవంతులు అని చెబుతారు. బట్టతల సిరిసంపదలు ఉన్న వారికే వస్తుందని ఒకప్పటి వాదన.: బొచ్చు లేనమ్మ బోడిగుండే నమమనుకుందట. బట్టగుండు వారు భాగ్యవంతులు అని చెబుతారు. బట్టతల సిరిసంపదలు ఉన్న వారికే వస్తుందని ఒకప్పటి వాదన. అలా అయితే ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువ మంది బట్టతల వారే ఉన్నారు. వారంతా శ్రీమంతులు కావాలి కదా. అదంతా ఏదో నానుడి. కానీ బట్టతలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సబ్బు వాడే అవసరం ఉండదు. షాంపు అక్కర్లేదు. నూనె అయితే దాని గురించి ఆలోచించే అవకాశమే లేదు. దీంతో బట్టతల ఉంటే అన్ని లాబాలే కానీ నష్టాలు మాత్రం ఉండవు. నష్టాలంటే అందం పోతుంది. ఎండ కొడుతుంది. గుండుకు రక్షణ లేకుండా పోతుంది.
బట్టతల ఉంటే ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయని సర్వేలు సూచిస్తున్నాయి. అందుకే ప్రపంచ మేధావుల్లో ఎక్కువ మంది బట్టతల వారే కావడం గమనార్హం. మహాత్మా గాంధీ, అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వారికి కూడా బట్టతల ఉండటంతోనే వారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులుగా ఎదిగినట్లు తెలుస్తోంది. దీంతో బట్టతల ఉంటే అదేదో అవలక్షణం కాదు బలమైన లక్షణమే. అందుకే బట్టతల వారు బాధపడకుండా తమ లక్ష్యం వైపే సాగుతారని సమాచారం.
Also Read: Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
అగ్రరాజ్యం అమెరికా బట్టతల వారికి ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. క్యాన్సర్డ్ ఫార్మాస్యూటికల్స్ అదిరిపోయే అవకాశం కల్పించింది. శాస్త్రవేత్తలు తయారు చేసిన సీటీపీ-543 మాత్రలను రెండేసి చొప్పున ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. దీంతో బట్టతల ఉన్న వారికి ఊరట లభించనుంది. వీటి వాడకంతో జట్టు రాలడం ఆగిపోతుందని తెలుస్తోంది. పైగా కొత్త జుట్టు వస్తుందని చెబుతున్నారు. దీంతో బట్టతల వారు భయపడాల్సిన పనిలేదని ధీమా చెబుతోంది.
ఈ ప్రయోగంలో పాల్గొన్న పది మందిలో నలుగురికి జుట్టు మళ్లీ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బట్టతల వారు బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. తమ బట్టతలను జుట్టుతల చేసుకోవడానికి ఇదో ఉపాయంగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఇకపై బట్టతల వారు బాధపడాల్సిన పనిలేదని సూచిస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలతో ఇకపై బట్టతల వారు కూడా చింతించకుండా జుట్టుతలతో మెరిసిపోయే అవకాశం ఉండటంతో అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ తలపై జుట్టు వస్తుందా అని ఆతృతగా ఉన్నారు.
Also Read:Age Gap Heros And Heroines: లేటు హీరోలు.. లేత హీరోయిన్లు.. గ్యాప్ ఎంతో తెలుసా?