
మనలో చాలామంది చక్కెరతో చేసిన ఆహారపదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే. టీ, కాఫీలు కూడా బెల్లంతో చేసినవి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నా చాలామంది చక్కెరతో చేసినవి తీసుకోవడానికే ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే చక్కెరతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
ఎవరైతే ఎక్కువగా చక్కెరతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటారో వాళ్ల జ్ఞాపకశక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది. చక్కెర పళ్ల సమస్యలకు కూడా పరోక్షంగా కారణమవుతుంది. చక్కెరతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లు బరువు పెరుగుతారు. చక్కెర ఎక్కువగా తీసుకునే వారిలో కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. చక్కెర శరీరంలోని శక్తిని క్రమంగా తగ్గిస్తూ మనుషులను బలహీనులను చేస్తుంది.
చక్కెరతో చేసిన ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకున్నవాళ్లే డయాబెటిస్ బారిన పడుతున్నారని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్, డిప్రెషన్ లాంటి సమస్యలకు సైతం చక్కెర కారణమవుతుందని తెలుపుతున్నారు. యాక్నే సమస్యలకు, చర్మం ముడతలు పడటానికి కూడా చక్కెర కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి.
అందువల్ల పంచదారకు బదులుగా బెల్లం ఎక్కువగా వినియోగిస్తే మంచిది. షుగర్ ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే వీలైనంత తక్కువ మోతాదులో వినియోగించాలి. చక్కెరతో తయారు చేసుకున్న ఆహారపదార్థాలకు బదులుగా ఇతర ఆహార పదార్థాలను ఎంచుకుంటే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది.