Monsoon Diet: వర్షాకాలం వ్యాధులకాలం. ఈ కాలంలో వ్యాధులు చుట్టుముడతాయి. వానకాలంలో రోగాలు దరి చేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. దగ్గు, దమ్ము, జ్వరం, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి జ్వరాలు విజృంభిస్తే ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు మార్గం ఉంటుంది. దీని కోసం మన ఆహార పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలి.
వర్షాకాలంలో పచ్చిమిరపకాయలను విరివిగా తీసుకోవాలి. ఇందులో విటమన్ సి, కె ఉన్నాయి. దీంతో వీటిని వానకాలంలో తీసుకోవడం వల్ల యాంటిఆక్సిడెంట్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి మన గుండెను సురక్షితంగా ఉంచుతాయి. అందుకే వర్షాకాలంలో పచ్చిమిరపకాయలను తీసుకుని నిరోధక శక్తిని పెంచుకుంటే మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ కాకుండా నిరోధిస్తాయి. పచ్చిమిరపకాయల్లో ఇంతటి లాభాలు ఉన్నందున వానకాలంలో వీటిని తరచుగా తీసుకోవడమే ఉత్తమం.
Also Read: China Companies Tax Evasion in India: భారత్ సొమ్ము చైనా కంపెనీల పాలు
వర్షాకాలంలో పండ్లు కూడా పుష్కలంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనమే. యాపిల్, జామ, దానిమ్మ, చెర్రీ, ఫ్లమ్స్, పీచెస్ వంటి పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంా ఉన్నందున పండ్లను తీసుకుని మన శరీరాన్ని కాపాడుకోవాలి. రోడ్ల పక్కన అమ్మే జ్యూస్ ల జోలికి పోకూడదు. తాజా పండ్లు తీసుకుని ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుంటే మంచిది. అంతేకాని బజార్లో లభించే జ్యూస్ లకు అలవాటు పడటం హానికరమే.
వర్షాకాలంలో వేడి పదార్థాలు తీసుకోవడం శ్రేయస్కరమే. గ్రీన్ టీ, మసాలా టీ వంటివి తాగడం వల్ల వేడి కలుగుతుంది. అలాగే సూప్ లు తీసుకుంటే కూడా మన శరీరం వెచ్చగా ఉంటుంది. చలి దరిచేరదు. అందుకే కూరగాయలను ఉడికించి తీసుకునే సూప్ లతో ఆరోగ్యానికి రక్షణ కలుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే వర్షాకాలంలో కూరగాయలతో చేసిన సూప్ లను ఎక్కువగా తీసుకుని ఆరోగ్యంపై శ్రద్ధ కనబరిస్తే వ్యాధులు దరిచేరవు.
కూరగాయలు కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే వర్షాకాలంలో లభించే కూరగాయలను తీసుకుంటే వైరల్, బ్యాక్టీరియాల వల్ల ఇబ్బంది ఉండదు. పెరుగు, మజ్జిగ, ఊరగాయాలు జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను కాపాడుతుంది. ఫలితంగా మనకు రోగనిరోధక శక్తి పెంచుతుంది. అందుకే వర్షాకాలంలో తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే మనకు సురక్షితమైన ఆరోగ్యం కలుగుతుందనడంలో సందేహం లేదు.
పాలు, పాల ఉత్పత్తులు, బీన్స్, సోయ, చిక్కుళ్లు, గింజలు కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చేయాలి. ఇంకా అల్లం, వెల్లుల్లిని కూడా తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఫంగల్, యాంటి ఇన్ ఫ్లమేటరీ శక్తుల వల్ల మనకు ఫ్లూ జ్వరం నుంచి రక్షణ ఇస్తాయి. ప్రతి రోజు మనం తాగే టీలో అల్లం చేర్చుకుంటే కూడా మంచిదే. అల్లం గొంతు సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది.
మెంతులు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ప్రతి రోజు నానబెట్టిన మెంతుల్ని మనం ఆహారంగా తీసుకుంటే డయాబెటిస్ కు చక్కని మందు అవుతుంది. మెంతులను మనం తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే మేలు చేస్తాయి. వర్షాకాలంలో వీటిని తీసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుందనడంలో సందేహం లేదు. పసుపు కూడా మన దేహానికి చాలా అవసరం. ఏదైనా గాయం అయితే వెంటనే పసుపు రాస్తే అది త్వరగా తగ్గిపోతోంది. అంటే పసుపులో కూడా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వానకాలంలో పాలలో పసుపు వేసుకుని తాగితే మనకు మేలు జరుగుతుంది.
ఇక ఒమేగా-3 శక్తిని అందించే చేపలు, రొయ్యలు, పీతలు, వాల్ నట్స్, గుల్లలు, పిస్తా వంటివి తీసుకుంటే కొవ్వును తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వర్షాకాలంలో వీటిని కూడా మన భోజనంలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మన దేహానికి అవసరమైన ఆహారాన్ని తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకుంటేనే మనకు అన్ని విధాలా ప్రయోజనం అని గ్రహించుకోవాలి.
Also Read:CI Nageswara Rao Case: తెలంగాణ ఖాకీ వనంలో ఎందరో నాగేశ్వరరావులు