Minister Goutham Reddy Passed Away: మనుషుల్లో వ్యవహార శైలి మారుతోంది. జీవన విధానం విరుద్ధమైపోతోంది. ఫలితంగా రోగాలు చుట్టుముడుతున్నాయి. పట్టుమని ముప్పై ఏళ్లు కూడా నిండకుండానే మధుమేహం,అధిక రక్తపోటు వస్తున్నాయి. దీంతో వాటి ప్రభావంతో మనిషి ఆయుప్రమాణం తగ్గిపోతోంది. దీంతో మనిషి ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. యాభై ఏళ్లు కూడా నిండకుండానే టపా కట్టేస్తున్నారు. కట్టుకున్న వారికి, పిల్లలకు దిక్కు లేకుండా చేస్తున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లు కొంప ముంచుతున్నాయి. తెల్లవారింది మొదలు మాంసం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లు మనిషి అధోపాతాళానికి పడిపోయేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అందరిలో కలవరం నింపుతోంది. యాభై ఏళ్లకే ఆయన జీవితం ముగించడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కన్నడ సినీ నటుడు రాజ్ కుమార్ కూడా ఇలాగే గుండెపోటుకు గురై చనిపోవడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం గుండె జబ్బుల ప్రభావంతో మధ్యలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులకు కన్నీరే మిగుల్చుతున్నారు.
దీనిపై వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. మనం తీసుకునే ఆహారమే మనకు ఎను శాపంగా మారుతోందని తెలిసినా వదలడం లేదు. మాంసంతో ఇబ్బందులున్నాయని చెబుతున్నా ఎవరు కూడా ఏముందిలే ఉన్నన్ని రోజులు తిని తరువాత వెళ్లిపోవడమే అనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మరణాల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. ఇటీవల కాలంలో అపోలో ఆస్పత్రి వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఔరా అనిపిస్తోంది.
చిన్న వయసులోనే కాటికి చేరడం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డికి కూడా ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేకున్నా ఆయన గుండెపోటుతో మరణించడం సంచలనం కలిగించింది. దీంతో ఆరోగ్య విషయాలపై అందరు ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. అంతేకాని మనకెందుకులే అని నిట్టూర్పు విరిస్తే మన పతనం మనమే కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
ఇప్పటికైనా మంచి అలవాట్ల కోసం వెళ్లాల్సి ఉంది. మద్యం, మాంసం, ధూమపానం వదిలేయాల్సి ఉంటుంది. కానీ మన జనాభాలో ఎక్కువ మంది వీటికి దాసోహం అవుతున్నారు. దీంతో వారి ఆయుర్దాయం క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. మన జీవితం మన చేతుల్లోనే ఉన్నట్లు తెలిసినా ఎందుకు నిర్లక్ష్యం అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆధునిక అలవాట్లకు లొంగకుండా మంచి జీవన విధానం అలవాటు చేసుకుని మన ఆయువును పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.