Milkweed Benefits: మన ఇంటి చుట్టు, పక్కకు, లేదంటే పెరట్లో ఇలా చాలా చోట్ల చాలా మొక్కలను చూస్తుంటాం. ఇవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటారు చాలా మంది. కానీ కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇంతకీ మీకు జిల్లెడు చెట్టు తెలుసా? ఈ చెట్టుతో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలిస్తే ఇంట్లో పెంచుకుంటారు. ఈ జిల్లేడు మొక్కల్లోని ఆకులు, కొమ్మలు, పూలల్లో పాలు వస్తుంటాయి. ఈ పాలల్లో, వాటి ఆకులతో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి.
శరీరంలో పేరుకొని పోయిన వ్యాధులను నయం చేస్తుంది ఈ జిల్లేడు చెట్టు. దీని వల్ల ఎలాంటి నొప్పి అయినా తగ్గిపోతుందట. తలనొప్పి, పైల్స్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని ఉపయోగిస్తే ఆరోగ్యంగా ఉంచడంలో ఈ జిల్లేడు చెట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఈ ప్లాంట్ ను కొందరు మదర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. బంజరు భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది ఈ మొక్క. తెలుపు, ఊదా రంగులో ఉండే ఈ పువ్వులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. తలనొప్పి, చెవి నొప్పిని స్వయంగా నయం చేస్తుంది. ఈ మొక్క కడుపు సంబంధిత సమస్యలను కూడా త్వరగా నయం చేస్తుంది. కానీ ఈ మొక్కను వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ డైసెంటెరిక్, యాంటీ ఫంగల్, యాంటీ సిఫిలిటిక్, యాంటీ రుమాటిక్ లక్షణాలను కలిగి ఉంది జిల్లేడు చెట్టు. దీని ఆకులను నూనెతో కలిపి వాడితే మంట తగ్గుతుందట. దీని పువ్వుల వల్ల పైల్స్ కు ఉపశమనం లభిస్తుంది.
ఈ సమాచారం ఇంటర్నెట్, ప్రజల విశ్వాసం మేరకు మాత్రమే అందించాము. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.