https://oktelugu.com/

Bael Plant : ఈ ఒక్క మొక్క చాలు ఎన్నో రోగాలను తరిమి కొడుతుంది..

ఈ బిల్వపత్రం అనేక ఔషధాల తయారీలో దీన్ని వినియోగిస్తుంటారు. సూక్ష్మక్రిమి సంహారిణిగా పని చేస్తుంది కూడా. మారేడు దళము గాలిని, నీటిని దోష రహితము చేయడంలో సహాయం చేస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 30, 2024 6:21 pm
    Bael Plant

    Bael Plant

    Follow us on

    Bael Plant : బిల్వపత్రం. దీన్ని మారేడు అని కూడా పిలుస్తుంటారు. ఇది నీటిని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కీళ్ల సంబంధ వ్యాధులను, విరేచనాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేయడంలో కూడా సహాయం చేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది ఈ బిల్వపత్రం. అనేక ఔషధాల తయారీలో దీన్ని వినియోగిస్తుంటారు. సూక్ష్మక్రిమి సంహారిణిగా పని చేస్తుంది కూడా. మారేడు దళము గాలిని, నీటిని దోష రహితము చేయడంలో సహాయం చేస్తుంది.

    మారేడు కాయలు, పండ్లు, ఆకులు, పూవులు, బెరడు, వేళ్ళు, ఆన్నీ కూడా ఔషధాలుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా అవసరయ్యే మందు. ఆయుర్వేదంలో దీని వేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మొలలకు కూడా ఇది మంచి ఔషధము. మెంతిపొడితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. దీని ఆకుల రసము షుగర్ వ్యాధి నివారణకు బాగా పని చేస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

    మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉండి మనసుకు హాయిని అందిస్తుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం కూడా ఉంటుంది. అలాగే విరేచనకారిగా ఉంటుంది. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతం అయ్యే వారు రిలీఫ్ అవ్వచ్చు. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వేసవి పానీయంగా ఉంటుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. అంతేకాదు వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.

    మారేడులో మరో విచిత్రం దాగి ఉంది. అదేంటంటే? బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి సహాయం చేస్తుంది. జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో మేలు చేస్తుంది. విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడిగా చేస్తే మరింత ఉపయోగం.

    మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుముఖం పడతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి రిలీఫ్ లభిస్తుంది. బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. బిల్వ ఆకుల కషాయానికి కొంచం తేనె చుక్కలు కలిపి తాగాలి. ఇలా చేస్తే జ్వరము తగ్గుతుంది.

    కడుపు లోను, పేగులలోని పుండ్లు తగ్గించే శక్తి ఈ బిల్వ ఆకులకు, ఫలాలకు ఉంది అంటున్నారు నిపుణులు. మలేరియాను తగ్గించే గుణము కూడా ఉందట. బిల్వ ఫలం నుంచి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరాలి. కాస్త తీసుకుంటూ గాయాల మీద అద్దాలి. ఇలా చేస్తే గాయాలు త్వరగా మానుతాయి. క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఈ బిల్వ చెట్టు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..