Mangoes: ఇది తెలిస్తే.. మామిడి పండ్లను తినకుండా ఉండలేరు..!!

ఫ్రూట్స్ లో రారాజుగా ఉన్న మామిడిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి, కె మరియు ఐరన్ తో పాటు వీటిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. మన దేశంలో సుమారు వందకు పైగా మామిడి పండ్ల రకాలు ఉన్నాయి. ఏపీలో బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి, కలెక్టర్ మామిడితో పాటు నీలం వంటి రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Written By: Swathi, Updated On : May 15, 2024 5:33 pm

Mangoes

Follow us on

Mangoes: సమ్మర్ వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది. ఈ సీజన్ లో లభించే పండు కావడంతో ప్రతి ఒక్కరూ వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. మామిడి పండ్లు మంచి రుచిని కలిగి ఉండటమే కాదు.. వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. మరి మామిడి పండ్లతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుందామా…!

ఫ్రూట్స్ లో రారాజుగా ఉన్న మామిడిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి, కె మరియు ఐరన్ తో పాటు వీటిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. మన దేశంలో సుమారు వందకు పైగా మామిడి పండ్ల రకాలు ఉన్నాయి. ఏపీలో బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి, కలెక్టర్ మామిడితో పాటు నీలం వంటి రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

మామిడి పండ్లను తినడం వలన అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు వీటిని తినడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం మామిడిలో ఉంది. అదేవిధంగా మామిడిలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. మయోకార్డియల్ డ్యామేజ్, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. దాంతోపాటు మామిడికి కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంటుంది.

కాలేయం, చర్మం, కంటి మరియు ఎముకల ఆరోగ్యానికి మామిడి ఎంతో మేలు చేకూర్చుతుంది. మధుమేహం రాకుండా మామిడి పని చేస్తుంది. అయితే ఇప్పటికే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తినడం వలన చక్కెర లెవల్స్ పెరుగుతాయి.

అదేవిధంగా మామిడిలో బిటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని బలోపేతం చేస్తుంది. అయితే… మామిడి పండ్లను ఎక్కువగా తినడం వలన బరువు పెరుగుతారని చెబుతుంటారు. వేడి చేయడం కొంత వరకు నిజమే అయినప్పటికీ మామిడి పండ్లకు, బరువు పెరగడానికి ఎటువంటి సంబంధం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.