Corona Virus: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదైనా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ప్రజల్లో కొంతమందికి కరోనా సోకినా ఆ లక్షణాలు కనిపించకుండానే కరోనా నుంచి కోలుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తల పరిశోధనలో దీర్ఘకాల కరోనా చాలా ప్రమాదకరం అని తేలింది.
లక్షణాలు కనిపించనంత మాత్రాన కరోనా సోకితే నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో అది దీర్ఘకాల కరోనాగా మారి ప్రాణాలకే అపాయం తెచ్చిపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కరోన వైరస్ దీర్ఘకాలం ప్రభావం చూపితే మన శరీరంలోని ప్రతి అవయవంపై ఆ ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రో బయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీర్ఘకాల కరోనా ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. దీర్ఘకాల కరోనా వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు, రాత్రిళ్లు చెమటలు పట్టడం ఇతర లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉంటుంది.
కరోనా వైరస్ గుండె పనితీరుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేకపోయినా కరోనా సోకిన వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిని గుండె సంబంధిత సమస్యలు వేధించాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.
Also Read: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్