
మన దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగేవాళ్లు, సిగరెట్ తాగేవాళ్లకు కరోనా సోకితే ఎక్కువ ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తుంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే మాత్రమే వైరస్ బారిన పడే అవాకాశాలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపేలా చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా ఫుడ్ ఇస్తామని బీరు ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నా వ్యాక్సిన్ తీసుకోవడానికి మాత్రం కొంతమంది ఆసక్తి చూపడం లేదు. వ్యాక్సిన్ పనితీరుపై ప్రజల్లో కొంతమందిలో అపోహలు నెలకొంటే మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని టెన్షన్ పడుతున్నారు. మద్యం తాగేవాళ్లలో కొంతమంది వ్యాక్సిన్ వేసుకుంటే మద్యం తాగకూడదని భావించి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎటావా జిల్లా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మందు అమ్మాలని లిక్కర్ షాపు యజమానులను ఆదేశించింది. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చామని అధికారులు చెబుతున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాక్ అనే చెప్పాలి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోని వారికి జీతం ఇచ్చేది లేదని అధికారులు చెప్పడం గమనార్హం.