Rice Side Effects: మనలో కొంతమంది ఆహారపు అలవాట్లు వింతగా ఉంటాయి. మధ్యాహ్నం, రాత్రి సమయాలతో పాటు ఉదయం సమయంలో కూడా మనలో కొంతమంది అన్నం ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే రోజులో మూడు పూటలా అన్నం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వైద్యులు సైతం రోజులో మూడుపూటలా అన్నం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వెల్లడిస్తుండటం గమనార్హం.
రోజులో మూడుపూటలా అన్నం తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మధుమేహంతో బాధ పడుతున్న వాళ్లు పరిమితంగా అన్నం తింటే మంచిదని చెప్పవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉండే అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. మరి కొందరు బియ్యాన్ని తింటూ ఉంటారు. బియ్యాన్ని తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
బియ్యాన్ని డైరెక్ట్ గా తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు అసిడిటీ, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మూడు పూటలా అన్నం తినే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మానుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా రైస్ తో వండని ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అతిగా అన్నం తినేవాళ్లు షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అన్నం రోజులో మూడుపూటలా తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Know these are the side effects of rice to eat too much in a day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com