https://oktelugu.com/

Summer Health: వేసవిలో గుడ్లను తింటే ఆరోగ్యానికి ప్రమాదమా.. వైద్యులేం చెప్పారంటే?

Summer Health: మనలో చాలామందిని గుడ్లను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వేసవికాలంలో గుడ్లను పరిమితంగా తీసుకోవాలి. పరిమితికి మించి వేసవిలో గుడ్లను తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శీతాకాలం, వర్షాకాలంలో రోజుకు 4 గుడ్లు తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించవు. గుడ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. వేసవిలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 30, 2022 / 09:03 AM IST
    Follow us on

    Summer Health: మనలో చాలామందిని గుడ్లను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వేసవికాలంలో గుడ్లను పరిమితంగా తీసుకోవాలి. పరిమితికి మించి వేసవిలో గుడ్లను తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శీతాకాలం, వర్షాకాలంలో రోజుకు 4 గుడ్లు తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించవు.

    Eggs

    గుడ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. వేసవిలో ఎక్కువ సంఖ్యలో గుడ్లను తింటే కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవిలో అలసట, బలహీనతలను తగ్గించడంలో గుడ్లు ఎంతగానో తోడ్పడతాయి. గుడ్లు వేసవిలో శరీరంలో వేడిని తగ్గిస్తాయి. గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, పాస్పరస్, ఖనిజాలు, విటమిన్స్ లభించే అవకాశాలు ఉంటాయి.

    Also Read: Chandrababu will Gives 40 Percent Tickets To Youth: యువతకే టికెట్లు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?

    వేసవిలో గుడ్లు ఏ విధంగా తీసుకున్నా పొందే ఆరోగ్య ప్రయోజనాలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని గుర్తుంచుకోవాలి. అయితే మరీ ఎక్కువగా గుడ్లను తీసుకుంటే మాత్రం నష్టం తప్పదనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఉడికించిన కోడిగుడ్డును తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే గుడ్లలో సీరమ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

    గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీర్ంలో కోలిన్ ఆక్సీకరణ పెరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు కోడిగుడ్లను పరిమితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు డయాబెటిస్ రిస్క్ ను పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?