Dinner: రాత్రివేళలో భోజనం తినడం లేదా.. ఈ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

Dinner: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. మనం చేసే చిన్నచిన్న తప్పులు బరువు పెరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతాయి. అయితే బరువు పెరిగిన వాళ్లు బరువు తగ్గించుకోవాలనే ఆలోచనతో వేర్వేరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రి సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండటం ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రాత్రివేళలో భోజనం చేయకపోవడం వల్ల శరీరానికి లాభం కలిగే అవకాశాలతో పోలిస్తే నష్టం చేకూరే అవకాశాలు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 5, 2022 9:11 am
Follow us on

Dinner: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. మనం చేసే చిన్నచిన్న తప్పులు బరువు పెరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతాయి. అయితే బరువు పెరిగిన వాళ్లు బరువు తగ్గించుకోవాలనే ఆలోచనతో వేర్వేరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రి సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండటం ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే రాత్రివేళలో భోజనం చేయకపోవడం వల్ల శరీరానికి లాభం కలిగే అవకాశాలతో పోలిస్తే నష్టం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే రాత్రి సమయంలో ఆహారానికి దూరంగా ఉంటారో వాళ్లను బలహీనత, తలతిరగడం, రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాత్రివేళలో ఆహారం తీసుకోకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది.

రాత్రిసమయంలో ఆహారం తీసుకోని వాళ్లకు శరీరానికి అవసరమైన పోషకాలు అందే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేసే సమయంలో చిన్నచిన్న తప్పుల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఆహారం తీసుకోని వాళ్లను గ్యాస్ సంబంధిత సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.

రాత్రివేళలో భోజనం తీసుకోని వాళ్లు బరువు ఎక్కువగానే ఉన్నా నీరసం, అలసట లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఎక్కువ మొత్తం కాకుండా కొంత మొత్తం ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు అరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.