Jaggery Benefits: బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెల్లం నేరుగా తీసుకున్నా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రస్తుతం చాలామంది బెల్లంకు బదులుగా చక్కెరను వినియోగిస్తున్నారు. అయితే బెల్లం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
ఐరన్ లోపంను అధిగమించడంలో బెల్లం ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించడంలో బెల్లం ఎంతగానో సహాయపడుతుంది. బెల్లం తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగే అవకాశంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చక్కెరతో పోలిస్తే బెల్లంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. బరువు తగ్గాలని భావించే వాళ్లకు బెల్లం దివ్యౌషధంగా పని చేస్తుంది. బెల్లం శరీర బరువును అదుపులో ఉంచడంతో పాటు ఉబ్బసం సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.
భోజనం చేసిన తర్వాత బెల్లం తీసుకుంటే ఆహారం సులువుగా జీర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి. బెల్లం జీవక్రియను మెరుగుపరచడంతో పాటు విటమిన్, ఖనిజ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. బెల్లం తినడం వల్ల అజీర్ణం, వాంతులు, గ్యాస్ సమస్యలకు సైతం సులభంగా చెక్ పెట్టవచ్చు. బెల్లం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది.
బెల్లంలో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కాల్షియం, భాస్వరం వల్ల ఎముకలు గట్టిపడతాయి. బెల్లంతో పాటు అల్లం ప్రతిరోజు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభీస్తుంది.