Benefits of fasting: మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరం. అయితే డబ్బు కోసం శ్రమించే వారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొంతమంది ప్రాణాలు లెక్కచేయకుండా డబ్బు కోసం కష్టపడుతున్నారు. అయితే ఆరోగ్య విషయంలో ఉపవాసం ఉంటున్నారని చెప్పేవారు కూడా ఉన్నారు. వారంలో రెండు రోజులు లేదా మూడు రోజులు దేవుళ్ళ పేరు చెప్పి ఏమి తినడం లేదని అంటూ ఉంటారు. కానీ మిగతా రోజుల్లో మాత్రం ఇష్టం వచ్చినట్లు తింటున్నారు. ఐదు రోజులపాటు ఎడాపెడా లాగించేసి.. రెండు రోజులు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మరి ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి?
ప్రస్తుత కాలంలో ఇంట్లో కంటే బయటి ప్రదేశాల్లో రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. చాలామంది ఇంట్లో కంటే బయట దొరికే వాటిని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. వినియోగదారుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. ఆహార పదార్థాల కేంద్రాలు ఎక్కువగా వెలుస్తున్నాయి. అయితే ప్రతిరోజూ తినడం వల్ల అనారోగ్యమని భావించి కొంతమంది వారానికి కొన్ని రోజులు మాత్రం తింటామని.. మిగతా కొన్ని రోజులు మాత్రం ఉపవాసం చేస్తామని చెబుతారు.
వారంలో కొన్ని రోజులపాటు ఉపవాసం ఉండి.. మిగతా రోజుల్లో చికెన్, మటన్, రొయ్య వంటివి తినడమే కాకుండా.. ఫ్రై ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఐదు రోజులపాటు ఇలాంటివి హెవీ వెయిట్ ఉన్న ఆహారం తిని.. రెండు రోజులు మాత్రం ఖాళీ కడుపుతో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ హెవీ ఫుడ్ తీసుకున్న సమయంలో శరీరంలో అనేక రకాలు చర్యలు జరిగే అవకాశం ఉంటుంది. ఆయిల్ ఫుడ్ తోపాటు ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల లావు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా శరీరంలో ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఉండి.. ఆ తర్వాత ఉపవాసం ఉంటే ఇవి డైజేషన్ అయ్యే అవకాశం ఉండదు. కొవ్వు పేరుకుపోయి అలాగే ఉంటుంది.
అయితే కొన్ని రోజులపాటు వెయిట్ ఫుడ్ తీసుకొని.. ఆ తర్వాత సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలని అనుకోకుండా.. ప్రతిరోజు న్యూట్రిషన్ కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యం లో ఉంటుంది. ఉపవాసం చేపట్టినా.. చేపట్టకపోయినా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ మాంసాహార పదార్థాలు తీసుకోవాలని అనుకున్నా.. తక్కువ మోతాదులో ఉండడం వల్ల ఎలాంటి హాని చేకూరదు. అలా కాకుండా పరిమితికి మించి మాంసాహారం తీసుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే ఉంటుంది.
కేవలం ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడంతో పాటు.. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు.