Eggs In Summer
Eggs In Summer: అత్యంత పౌష్టికరమైన ఆహారం గుడ్డు. దీన్ని తీసుకోవడం ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. కానీ చలికాలంలో తీసుకుంటే మంచిది. ఎండాకాలంలో దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. గుడ్డులో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవిలో దీన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. గుడ్డు వల్ల మనకు నష్టాలే ఎక్కువ. శీతాకాలంలో తీసుకోవడం వల్ల వేడి పెరిగి మన ఆరోగ్యానికి సహకరిస్తుంది.
ఎండాకాలంలో సహజంగానే వేడిగా ఉంటుంది. బయటి వేడితోనే సతమతమవుతుంటాం. దీంతో గుడ్డు తింటే ఈ వేడి కూడా కలిసి మన శారీరక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో ఆ వేడి ఈ వేడి కలిసి మనం తిన్న పదార్థాలు జీర్ణం కాకుండా పోతాయి. అందుకే ఎండాకాలంలో గుడ్లు తీసుకోవడం వల్ల నష్టాలే ఎక్కువగా వస్తాయి.
వేసవిలో గుడ్డు తినడం వల్ల కడుపుపై ఎసిడిటి, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది. తిన్న ఆహారాలు అరగడానికి చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు గుడ్డు తీసుకోవడానికి మొగ్గు చూపకపపోవడమే బెటర్. ఈ నేపథ్యంలో గుడ్డు వల్ల కలిగే నష్టాల వల్ల దాన్ని తినేందుకు చొరవ తీసుకోకపోవమే మంచిదనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
గుడ్డు వల్ల లాభాలున్నా పరిమితి దాటకూడదు. అతిగా తింటే అనర్థమే. అందుకే మితంగానే తీసుకోవాలి. అంటే నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే తీసుకుంటే ఏం కాదు. కానీ ఇంకా ఎక్కువ సార్లు తీసుకుంటే మనకే ప్రమాదం ఏర్పడుతుంది. వేడి వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. గుడ్లు తినకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం.