Beer Summer: ఈ ఎండాకాలంలో బీరు తాగడం మంచిదేనట.. కానీ ఇలా చేయండి

బీరులో ఉండే వాంటోహుమోల్ అే ప్లేవానయిడ్లు క్యాన్సర్ కు కారనమయ్యే ఎంజైమ్ లను నిరోధించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అనారోగ్యాలను దూరం చేస్తుందని చెబుతున్నారు.

Written By: Srinivas, Updated On : May 26, 2023 7:18 pm

Beer Summer

Follow us on

Beer Summer: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం చెబుతూనే దుకాణాలు నిర్వహిస్తోంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతోంది. ప్రభుత్వానికి ఖజానా మొత్తం మద్యం నుంచే వస్తుంది. దీంతో దాన్ని ఎందుకు వదులుకుంటుంది. తాగే వారున్నంత కాలం ప్రభుత్వానికి ఢోకా లేదు. ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు పనిచేయాల్సిందే. అలాగే ప్రభుత్వం నడవాలంటే కొందరు తాగాల్సిందే. ఈ సులభమైన చిట్కాతో రాష్ట్రాల ప్రభుత్వాలు తమ జేబులు నింపుకుంటున్నాయి. పేదవాడి ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. వాడు తాగితాగి తన ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని రోగాల మయం కావించుకుంటున్నాడు. ఎవడి పెళ్లి పెటాకులైతే ఏంటి మనకు పట్టెడు పప్పన్నం దొరికితే చాలు అన్నట్లు గవర్నమెంట్ ఉంది.

ఇటీవల కాలంలో మద్యం తాగడం ఓ ఫ్యాషనై పోయింది. మద్యం తాగనోన్ని నీచంగా చూస్తున్నాడు. తాగినవాడిని మాత్రం ఏదో మేధావిగా అభివర్ణిస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది. తాగుడుకు బానిసలుగా మారారు. మద్యం చుక్కలేనిదే మనలేకపోతున్నారు. నోట్లో చుక్క లేనిదే చక్కగా ఉండలేకపోతున్నారు. మద్యం అంత ఆకర్షితులను చేసింది. అల్కాహాల్ ఆరోగ్యానికిచేటు అని అందరికి తెలిసినా అందులో బీరు తాగితే అది శరీరానికి మంచిదే అని చెప్పడం గమనార్హం.

బీరులో ఉండే వాంటోహుమోల్ అే ప్లేవానయిడ్లు క్యాన్సర్ కు కారనమయ్యే ఎంజైమ్ లను నిరోధించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అనారోగ్యాలను దూరం చేస్తుందని చెబుతున్నారు. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను సైతం నిర్వీర్యం చేస్తుంది. ఈ వ్యర్థాలను మూత్రంతోపాటు బయటకు పంపేందుకు సాయం చేస్తుందట. మెడికల్ ట్రీట్ మెంట్ కు ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఇందులో అల్కహాల్ శాతం తక్కువగా ఉంటుందట. అందుకే దీన్ని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట. దీన్ని మనం నమ్మాలి. ఎంతటి గుడ్డిగా చెబుతున్నారో తెలియడం లేదు. బీరులో అనారోగ్యకరమైన పదార్థాలు లేవని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. వారి ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేసి ప్రజాధనాన్ని పిండేస్తున్నారు.