Heart Health: ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. 2019 సంవత్సరంలో దాదాపు 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో చనిపోయారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇందులో 85 శాతం మంది గుండె జబ్బులు, గుండెపోటుతోనే మరణించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాధులు పెరగడానికి గట్ కూడా కారణమే అని చెబుతున్నారు. ఈ వ్యాధులకు కారణాలెన్నో ఉన్నా గుండె సమస్యలను మాత్రం విస్మరించకూడదు.
కడుపు సమస్యలు కూడా గుండె జబ్బులను ప్రభావితం చేస్తున్నాయి. గుండెకు కడుపుకు అవినాభావ సంబంధం ఉంటుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. ఉదరం గుండెకు సంబంధం ఉంటుంది. ఉదరంలో జీర్ణ సమస్యలు ఉండటం వల్ల పోషకాలు గ్రహించకుండా పోతుంది. పోషక లోపాలుండటం వల్ల పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలు అందకపోవడంతో గుండె పనితీరు మందగిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులకు కారణమవుతుంది.
మారుతున్న జీవనశైలి కారణంగా మనకు రోగాలు వస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శారీరక శ్రమ లేకుండా వ్యాయామం చేయకుండా అనారోగ్య కరమైన అలవాట్ల కారణంగా గుండె సంబంధితమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మాంసాహారానికి చాలా మంది ఆకర్షితులవుతున్నారు. దీంతో కూడా మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది.
నడుము నొప్పి కూడా గుండెపోటు వస్తుందని చెబుతుంది. ఎసిడిటి కూడా వస్తుంది. కానీ ఇవి పట్టించుకోకపోతే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో మనకు ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీంతో మన ఉదర సంబంధిత వ్యాధులపై కూడా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే మన ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉంటుంది. ఇలా మన అనారోగ్య సమస్యలను గుర్తించుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం.