Children Names: మనలో చాలామంది పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలకు వెరైటీ పేర్లు పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర పిల్లలతో పోల్చి చూస్తే తమ పిల్లలకు కొత్త తరహా పేర్లను పెట్టడానికి ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లలకు దేవుళ్ల లేదా దేవతల పేర్లు పెడితే చాలా మంచిదని చెప్పవచ్చు.
పిల్లలకు దేవుళ్ల, దేవతల పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆడపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెడితే మంచిదని మగపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెట్టకపోతే మంచిదని సంఖ్యా శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు పేర్లు పెట్టేముందు జన్మ నక్షత్రం ఆధారంగా పేర్లు పెడితే మంచిదని చెప్పవచ్చు. పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లీదండ్రులు పిల్లలకు రెండక్షరాల పేర్లు పెడితే మంచిదని చెప్పవచ్చు.
మగ పిల్లలకు 2, 4, 6 అక్షరాల పేర్లను పెడితే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు పేర్లు పెట్టాలని అనుకునే వాళ్లు బిడ్డ పుట్టిన 11వ రోజు లేదా 12వ రోజు పేరు పెడితే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో అర్థవంతమైన పేరును పెడితే మంచిది. జ్యోతిష్కుల సలహా ప్రకారం పిల్లలకు పేర్లు పెడితే పిల్లల భవిష్యత్తుకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
పౌర్ణమి, అమవాస్య, చతుర్దశి, అష్టమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టడం మంచిది కాదు. నవమి రోజున కూడా పిల్లలకు పేర్లు పెట్టడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలకు పెట్టే పేరు ఆధారంగానే వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.