Indian Gooseberry: ఈ చెట్టు ఉంటే చాలు మీకు ఎలాంటి వ్యాధులు రావు..

ఉసిరిలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. రోజుకో యాపిల్ తినలేని వారు ఒక ఉసిరి తింటే చాలు అంటారు పెద్దలు. అయితే కాయలు మాత్రమే అనుకోవద్దు. ఎందుకంటే ఉసిరి ఆకులతో కూడా శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. ఎన్నో రకాల వ్యాధుల నయం చేయడంలో ఉసిరి ఆకులు ది బెస్ట్ మెడిసిన్ అనిపించుకున్నాయి.

Written By: Swathi Chilukuri, Updated On : September 30, 2024 11:58 am

Indian Gooseberry

Follow us on

Indian Gooseberry: ప్రకృతి చాలా ఔషధాలను నార్మల్ గానే అందిస్తుంది. ఎన్నో మొక్కల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సరిగా వాడటం తెలియాలి కానీ ఇంటి వెనకాల పెరట్లోనే ఎన్నో రోగాలకు చెక్ పెట్టే మొక్కలు ఉంటాయి. ఆయుర్వేదం చేసే గొప్ప పని ఇదే. ఇంటి ముందు ఉన్న తులసికి పూజ చేస్తారు. ఇదే తులసిలో చెప్పలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మందారం, గులాబీ, తులసి, ఉసిరి ఇలా చాలా చెట్లతో ఎన్నో సమస్యలకు నార్మల్ గా చెక్ పెట్టవచ్చు. అయితే ఇప్పుడు ఉసిరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉసిరిలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. రోజుకో యాపిల్ తినలేని వారు ఒక ఉసిరి తింటే చాలు అంటారు పెద్దలు. అయితే కాయలు మాత్రమే అనుకోవద్దు. ఎందుకంటే ఉసిరి ఆకులతో కూడా శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. ఎన్నో రకాల వ్యాధుల నయం చేయడంలో ఉసిరి ఆకులు ది బెస్ట్ మెడిసిన్ అనిపించుకున్నాయి. ప్రమాదకర హెపటైటిస్ వంటి వ్యాధులకు కూడా ఉసిరాకుతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది.

ఉసిరి ఆకులు చాలా వగరుగా ఉంటాయి. కాస్త తీపి రుచి కూడా మిళితం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 3 రకాల దోషాలు ఉంటాయట. వాత, పిత్త, కఫ వంటి దోషాలు ఉంటాయి. ఈ దోషాలకు విరుగుడు ఉసిరి ఆకు అని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఉసిరి ఆకులు పప్పు వంటి వాటిల్లో వేసుకొని వండుకోవచ్చట. ఇక పొడిలాగా మార్చి కూడా ఉపయోగించవచ్చు. బ్లడ్ డిజార్డర్స్, ఇన్ఫ్లమేషన్, మలేరియా, యూరినరీ ట్రాక్ట్ ఇనెఫెక్షన్ వంటి 120 వ్యాధుల చికిత్సలో ఈ ఉసిరిని వాడుతున్నారు. కేవలం ఉసిరి ఆకుల వల్ల కూడా ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అన్నమాట.

ఉసిరి ఆకుల పొడి తీసుకుంటే.. కడుపులో అల్సర్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. ఉసిరి ఆకుల్లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-వైరల్ లక్షణాల వల్ల లివర్ డ్యామేజ్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. అలానే లివర్ ఫంక్షనింగ్ కు మెరుగు అవడానికి తోడ్పడుతుంది ఉసిరి. ఉసిరిలోని పోషకాలు.. కాలేయ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయం చేస్తాయి. ఉసిరి ఆకుల పొడిని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం, జ్వరాల వంటి నుంచి తప్పించుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

అలానే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు ఉసిరి ఆకుల పొడి తినడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయట. కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు పిత్తాశయ రాళ్ల నివారణలోనూ ఉసిరి ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..