Corona Risk: ప్రజలను తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్న వైరస్ లలో కరోనా వైరస్ ఒకటనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వాళ్లు సులువుగానే కోలుకుంటున్నా వాళ్లను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తాజాగా స్వీడన్ పరిశోధకులు కరోనా వైరస్ గురించి పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు రక్తం గడ్డకట్టే ముప్పు ఆరునెలల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
10 లక్షల కరోనా సోకిన కేసులను కరోనా సోకని 40 లక్షల కేసులతో పోల్చి చూసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 6 నెలల వరకు ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టే అవకాశం అయితే ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపించిన వాళ్లకు ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తం గడ్డ కట్టడానికి కచ్చితమైన కారణాలను గుర్తించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి కరోనా వ్యాక్సిన్ ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అన్నారు. పరిమితులకు లోబడి ఈ అధ్యయనం చేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.