Public Toilet:అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా పనిమీద బయటకు వెళ్లిన సమయంలో టాయిలెట్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త బట్టలను కొనుగోలు చేయడానికి వెళ్లిన సమయంలో ట్రయల్ రూమ్ ను తప్పనిసరిగా వినియోగించాలి. అయితే కొందరు కీచకులు ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాల సహాయంతో పబ్లిక్ టాయిలెట్స్ లో, ట్రయల్ రూమ్ లో వీడియోలు చిత్రీకరించే ఛాన్స్ ఉంది.

కొంతమంది ప్రైవేట్ వీడియోలను షూట్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. గతంలో పలువురు ప్రముఖులకు సైతం స్పై, హిడెన్ కెమెరాల వల్ల చేదు అనుభవాలు ఎదురయ్యాయి. హోటళ్లు, షాపింగ్ మాల్స్ లో వాష్ రూంలను వినియోగించే సమయంలో పరిసరాలను నిశితంగా గమనించాల్సి ఉంటుంది. కెమెరాలు దాచేందుకు ఎన్నో అనువైన ప్రదేశాలు ఉంటాయి.
Also Read: రోజుకు 2 నిమిషాలు అద్దం ముందు ఇలా చేయండి.. విజయాన్ని పొందండి!

ఏవైనా చిన్న రంధ్రాలు కనిపిస్తే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండే ఛాన్స్ ఉంటుందని భావించాలి. ట్రయల్ రూమ్ కు వెళ్లిన సమయంలో అద్దం సింగిల్ సైడ్ అద్దమో, డబుల్ సైడ్ అద్దమో చెక్ చేసుకోవాలి. వేలి మధ్య గ్యాప్ ఉంటే అది సింగిల్ సైడెడ్ అద్దం అని వేలి మధ్య గ్యాప్ లేకపోతే అది డబుల్ సైడెడ్ అద్దం అని గుర్తుంచుకోవాలి. స్పై కెమెరాలు ఉన్న గది నుంచి సిగ్నల్ సమస్యలు వస్తే కాల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

గదిలో లైట్లను ఆర్పి మొబైల్ కెమెరా ఫ్లాష్ ను ఆన్ చేయడం ద్వారా కూడా సీక్రెట్ కెమెరాను గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫోన్ లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా కూడా హిడెన్ కెమెరాలను గుర్తించవచ్చు. హిడెన్ కెమెరాలు ఉన్నాయని నిర్ధారణ అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా 911 అనే నంబర్ కు కాల్ చేయడం చేయాల్సి ఉంటుంది.
Also Read: సంతాన సమస్యా.. ఐతే ఇది మీ కోసమే !