
పెద్దలు పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలన్నా, తెలివితేటలు ఉండాలన్నా బ్రహ్మి ఆకుని ఉపయోగించేవారు. వాడుక భాషలో బ్రహ్మి ఆకును సరస్వతి ఆకు అని పిలుస్తారు. పరగడుపున ఈ ఆకును పొడిగా చేసుకుని తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ఆకు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ఆకు ఆలోచనా శక్తిని పెంచడంతో పాటు మెదడు చురుకుగా పని చేసేలా చేస్తుంది.
ఈ ఆకు పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం రూపంలో ఆయుర్వేద దుకాణాలలో లభిస్తోంది. చిన్న మెదడుకు ఆధారమైన సెరెబెల్లమ్ మాదిరిగా ఉండే ఈ ఆకు కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒత్తిడి ప్రతిస్పందనతో సంబంధం ఉన్న హార్మోన్లను ఈ ఆకు నియంత్రిస్తుంది. అల్జీమర్స్ తో బాధ పడేవాళ్లకు ఈ ఆకు దివ్యౌష్ధంలా పని చేస్తుంది.
ఈ ఆకుల్లో బాకోసైడ్లు అని పిలువబడే బయో కెమికల్ ఉండటం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తిని నియంత్రించడంలో ఈ ఆకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ఆకు తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావం చూపడంలో ఉపయోగపడుతుంది. ఈ ఆకు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.
ఈ ఆకు ఆర్థరైటిస్, గౌట్, ఇతర తాపజనక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి, ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు ఈ ఆకు ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఈ ఆకు సహాయపడుతుంది.