https://oktelugu.com/

Indian Railways: రైలు ప్రయాణం చేసేవారికి హెచ్చరిక ! రాత్రి పూట ప్రయాణాల్లో ఈ తప్పు చేసేవారికి భారీ జరిమాన!

Indian Railways: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేదే. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత మన రైల్వేైపైనే ఉంది. దీంతో ప్రతి రోజు లక్షలాది మందిని సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చుతోంది. రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల ప్రయోజనాలే ప్రధానంగా నిబంధనలు విధిస్తోంది. వీటిని వారు సద్వినియోగం చేసుకోవచ్చు. అవసరమైతే ఫిర్యాదు కూడా చేయవచ్చు. ప్రయాణికులకు వారి కోసం ఉద్దేశించిన నిబంధనల గురించి తెలియడం లేదు. దీంతో వారు వాటిని […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 5, 2022 1:38 pm
    Follow us on

    Indian Railways: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేదే. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత మన రైల్వేైపైనే ఉంది. దీంతో ప్రతి రోజు లక్షలాది మందిని సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చుతోంది. రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల ప్రయోజనాలే ప్రధానంగా నిబంధనలు విధిస్తోంది. వీటిని వారు సద్వినియోగం చేసుకోవచ్చు. అవసరమైతే ఫిర్యాదు కూడా చేయవచ్చు. ప్రయాణికులకు వారి కోసం ఉద్దేశించిన నిబంధనల గురించి తెలియడం లేదు. దీంతో వారు వాటిని వినియోగించుకోవడం లేదు.

    Indian Railways

    రాత్రి పూట రైలు ప్రయాణాలు చేస్తారు. దీంతో ఏ అలజడి లేకుండా చూసుకోవచ్చు. కొందరు బిగ్గరగా మాట్లాడతారు. మరికొందరు పెద్ద గొంతు వేసుకుని పాడుతుంటారు. ఇంకొందరు పెద్దగా అరుస్తారు. దీంతో తోటి వారికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవన్ని రైళ్లలో నిషేధం. తోటి వారికి ఎలాంటి చప్పుడు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా అతిక్రమించి అలా ప్రవర్తిస్తే వారిపై కేసు కూడా పెట్టవచ్చు.

    Also Read: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సఖ్యత నెలకొంటుందా?

    రైల్వే నిబంధనల ప్రకారం రాత్రి పూట పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లైట్లు వెలిగించకూడదు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఎవరైనా లైట్లు వేస్తే ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వారికి జరిమనా కూడా విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు చట్టాలను ఉపయోగించుకుని సురక్షితమైన ప్రయాణాలు చేయవచ్చు.

    Indian Railways

    అందరు రైల్వే లో రాత్రిపూట నిద్రపోతారు. అందుకే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే పాటలు పాడటం, మాట్లాడటం, లైట్లు వేయడం తదితర పనులు చేయకూడదు. ఒకవేళ మాకెందుకులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకునేందుకు చట్టాలు సహకరిస్తాయి. అందుకే ఫిర్యాదు చేస్తే శిక్ష తప్పదని తెలుసుకుని మసలుకోవాల్సి ఉంటుంది.

    Also Read:Ganesh Temple in America: అమెరికాలోనూ ఓ వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్ గా నామకరణం

    Tags