Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు కీలక సూచన

వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటున్నారు. అందుకే భక్తుల సంఖ్య పెరిగినా అధికారుల చొరవ వల్ల భక్తులకు కష్టాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Written By: Srinivas, Updated On : July 1, 2023 6:57 pm
Follow us on

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్లన్ని భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇప్పటికే స్కూళ్లు ప్రారంభమైనా భక్తుల తాకిడి మాత్రం ఆగడం లేదు. దీంతో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అధికారులు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అధికారులు కూడా వారికి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు రావడం గమనార్హం. దాదాపు 73 వేల మంది భక్తులు దేవుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి ఇంకా భక్తుల తాకిడి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. టోకెన్లు తీసుకున్న భక్తులకు కూడా సమయం బాగానే పడుతోంది.

తిరుమల ఎటు చూసినా జన సంచారమే కనిపిస్తోంది. గతంలో జనసందోహం పెరిగినప్పుడు కలిగిన అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనం పెరిగినా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. ఇంకా వారం రోజుల పాటు జనం ఇలాగే వస్తారని చెబుతున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

స్వామి వారి దర్శనానికి ఇంత పెద్ద మొత్తంలో భక్తుల రాక ఊహించిందే. ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి ఈ సీజన్ లో ఇలాగే ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రాక కొత్తేమీ కాదు. వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటున్నారు. అందుకే భక్తుల సంఖ్య పెరిగినా అధికారుల చొరవ వల్ల భక్తులకు కష్టాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.