China Foods: చైనా.. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేంది చౌక వస్తువులు.. మార్కెట్‌లో తక్కువ ధరలకు వచ్చే వస్తువులన్నీ దాదాపు చైనా నుంచి దిగుమతి చేసుకునేవే. చిన్న పిన్ను నుంచి మొదలు పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అన్నీ చైనాలో తయారై ప్రపంచ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్.. అందులో చైనావారు వాడే పదార్థాలు, ప్రజలకు హానిచేసే తీరు గురించి తెలుసకోవాలి. ప్రపంచం గుర్తించిన కొన్ని కల్తీ, నకిలీ ఆహార పదార్థాల తయారీ గురించి తెలుసుకుందాం.
చైనా సాస్..
చైనా ఫాస్ట్ ఫుడ్ అనగానే అందరూ లొట్టలేసుకుని తింటారు. కానీ ఇందులో వాడే సాస్ కూడా చైనాదే. కానీ ఈ సాస్‌ను సోయా లేకుండానే చైనాలో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి. మంగళి షాపుల నుంచి తెచ్చిన వెంట్రుకలు, వెట్ కండోమ్స్, శానిటరీ నాప్కిన్స్‌తో దీనిని తయారు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే.. తక్కువ ధర కసమే. సోయాతో చేయడం ఖరీదైంది. వెంట్రుకలతో తయారీ సులభం,« ధర కూడా తక్కువ. వెంట్రుకలను కండోమ్స్, న్యాప్కిన్స్‌లో వేసి ఉడికించడం ద్వారా అమినో యాసిడ్ వస్తుంది. ఇది అచ్చం సోయాతో తయారు చేసినట్లుగా ఉంటుంది. దీనికి కొన్ని ఫ్లేవర్స్ కలిసి మార్కెట్‌లోకి విడుదల చేశారు. దీనిని తర్వాత గుర్తించిన ప్రభుత్వం సీజ్ చేసింది. కంపెనీల్లో పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేసింది. ఈ సోయా అమ్మకాలు తగ్గాయి.
Also Read: IPL 2022- RCB Playoffs: చిట్టచివరన కొట్టిన కోహ్లీ.. ఆర్సీబీ ప్లేఆఫ్ చేరాలంటే ఇది జరగాలి
పశువుల రక్తంతో ఫాస్ట్ ఫుడ్..
చైనీయులకు ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువ ఇష్టం. వీరికి అత్యంత ఇష్టమైన వాటిలో బాతు రక్తం ఒకటి. దీనిని ఇష్టంగా తింటారు. దీనిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. బాతు రక్తం ఖరదైనది కావడంతో పంది, గేదె నుంచి తీసిన రక్తంతో ఫాస్ట్ ఫుడ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. దీనికి కొన్ని ఫ్లేవర్స్ కలిసి విక్రయిస్తున్నారు. బాతు రక్తాన్ని, టేస్ట్‌ను పోలి ఉండడంతో చైనీయులు ఎక్కువగా తింటున్నారు. అయితే దీనితో కిడ్నీలు పాడవుతాయని, గుండె సంబంధ వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చికెన్ ముక్కల్లోనూ కెమికల్స్..
చైనా మాసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే నంబర్ వన్. ప్రముఖ స్నాక్స్ కంపెనీలు అయిన మెక్ డోనాల్డ్, కేఎఫ్‌సీ గతంలో చైనా నుంచే మాంసం దిగుమతి చేసుకునేవి. కలుషిత ఫ్యాక్టరీల నుంచే మాంసం తీసి చైనీయులు ఎగుమతి చేశారు. 2014 నుంచి 2016 వరకు చైనాలోని కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్‌లోని స్నాక్స్ తిన్నవారు అనరోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆసియా వ్యాప్తంగా అమ్మకాలు తగ్గాయి. తాజా మాంసం, పాత మాంసం కలిపి సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన ప్రముఖ ఫుడ్ ప్రాంచైజీలు గుర్తించి దిగుమతి నిలిపివేశాయి. కంపెనీ మూతపడింది.
అట్ట ముక్కల బ్రెడ్..
కాడ్ బోర్డు ముక్కలతో చైనీయులు బ్రెడ్ తయారు చేస్తారంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇది నిజం, పాత కాడ్‌బోర్డు ముక్కలను కాస్టిక్ సోడాలో నానబెడతారు. తర్వాత అది మెత్తని మైదాపిండిలా తయారవుతుంది. తర్వాత దానిలో షుగర్, ఫ్లేవర్స్ కలిసి బ్రెడ్,బన్స్ తయారు చేసి ఓవెన్‌లో కాల్చి విక్రయిస్తారు. పిండితో తయారు చేసిన బ్రెడ్‌కు ఏమాత్రం తేడా తెలియకపోవడంతో చైనీయులు లొట్టలేసుకుని తిన్నారు. ఇంకా కొన్ని కంపెనీలు పాత బ్రెడ్‌కు రీసైక్లింగ్ చేసి విక్రయించాయి. ఈ విషయం తెలియడంతో ప్రపంచం చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా చైనా మాత్రం తన తప్పు అంగీకరించలేదు. కావాలనే తమపై తపుపడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించం గమనార్హం.
చైనిపోయిన కోడి..
చైనాలో చనిపోయిన కోడిని కూడా తాజా మాంసంగా మార్చుతున్నారు. ఇంజెక్షన్లు ఇచ్చి ఆకర్షణీయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ట్రింబోలోన్ అనే స్టెరాయిడ్‌ను చనిపోయిన, బతికున్న కోళ్లకు ఇవ్వడం ద్వారా బలిష్టంగా తయారవుతాయి. మాసం కూడా ఎక్కువ కాలం తాజాగా ఉటుంది. దీంతో చైనీయులు చనిపోయన వాటికి వీటిని ఇచి మాంసం తాజాగా చూపి విక్రయిస్తున్నారు. ఇది విక్రేతలకు ఎంత లాభం తెస్తుందో గానీ తినేవాళ్లకు మాత్ర చాలా నష్టం. స్టెరాయిడ్ మన శరీరంలకి వెళ్లగానే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. కిడ్నీపై ప్రభావం చూపుతుంది.
ధర్మాన్ని బ్రష్టుపట్టించడం..
కలుషిత వ్యవహారంలో చైనీయులు ఒక్కటిగా ఉంటారు. జాతీ, మతం ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తారు. ఇక్కడ బీఫ్ తినాలంటే అక్కడి వారు అందులో ఎక్కువ పంది మాంసం కలిపి విక్రయిస్తారు. అచ్చం బీఫ్‌లా కనిపించేలా పంది మాసం తయారు చేస్తారు. ఇందుకు చైనీయులు ప్యారాఫినివాక్స్. ఇది పెట్రోలియంతో చేయబడి ఉంటుంది. ఇందులో ఇండస్ట్రీయల్ సాల్ట్ కలుపుతారు. అందులో పందికొవ్వును ఉంచుతారు. కాసేపటికి అంది బీఫ్‌గా మారుతుంది. దీనిని తినడం వలన శరీరంలో ఎలర్జీ వస్తుంది. సోడియం క్టోరైడ్ శాతం తగ్గుతుంది. స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఫ్లేవర్డ్ డ్రిక్స్..
చైనీయులు రసాయనాలతో ఫ్లేవర్డ్ డ్రిక్స్ తయారు చేస్తున్నారు. ఇందులో హానికరమైన రసాయనాలు కలిపి అమ్ముతున్నారు. తాజాగా కనిపించేందుకు కెమికల్స్, కెరొటోనాయిడ్ కలుపుతారు. దీనితోహార్డ్‌కు ముప్పు ఉంటుంది. కళ్లు మండుతాయి. లావెక్కుతారు. అయినా చైనీయులు వీటిని తయారుచేసి విక్రయిస్తున్నారు.
డేంజర్ మష్రూమ్స్..
పొలాల్లో మస్రూమ్స్ పెంచుతున్నప్పుడు పురుగులు ఆశిస్తే అధిక మొత్తంలో కెమికల్స్ చల్లి కలుషితం చేస్తున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయ కలుషిత నీటితో మష్రూమ్స్ పండిస్తున్నారు.దీంతో అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి.
చాయ్‌లో టాపియోకా పల్స్..
చైనీయులు చాయ్‌లో టాపియోగా పల్స్ తింటారు. అయితే వీటిని ఎక్కువ తాజాగా ఉంచేందుకు రసాయనాల్లో ముంచి ఉంచుతారు. దీనిని తినడం వలన త్వరగా డైజేషన్ కాదు. ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కడుపులో ఎక్కువకాలం నిల్వ ఉంటే క్యాన్సర్‌కు కారణమవుతుంది.
ఇలా చైనీయులు తయారు చేస్తున్న ఫుడ్స్ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. అయినా ప్రపంచానికి తక్కువ ధర పేరుతో వీటిని అంటగడుతున్నారు.
Also Read:Chandrababu Naidu: దూకుడు పెంచిన చంద్రబాబు.. ముందుగాను అభ్యర్థులు ఫిక్స్